ప్రాణాల‌కు తెగించి క‌రోనా బాధితుల‌కు వైద్య‌సేవ‌లు అందిస్తున్న వైద్య సిబ్బందికి శుభవార్త‌. సేవ‌లు అందిస్తున్న క్ర‌మంలో వైద్యులు, సిబ్బంది క‌రోనా బారిన‌ప‌డ‌కుండా ఉండేందుకు డీఆర్‌డీవో ప్ర‌త్యేక‌మైన బ‌యోసూట్‌ను త‌యారు చేస్తోంది. క‌రోనా వైర‌స్ వైద్య సిబ్బంది ద‌రిచేర‌కుండా ఉంచేందుకు ఈ సూట్స్ ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇవి ర‌క్ష‌ణకు మాత్ర‌మే కాదు సింథ‌టిక్ బ్ల‌డ్ లోప‌లికి ప్ర‌వేశించ‌కుండా కూడా ఆపుతాయ‌ని మినిస్ట‌ర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్‌ఫేర్ అంటోంది. అయితే.. ఇంత‌కుముందు రోజుకి 7 వేల సూట్లు త‌యారు చేసేవారు. కానీ వైద్యుల ప‌రిస్థితి మ‌రీ ద‌య‌నీయంగా ఉండ‌డంతో అందుబాటులో ఉన్న‌ టెక్నాల‌జీతో రోజుకి 15 వేల సూట్లు త‌యారు చేస్తున్న‌ట్లు డీఆర్‌డీవో ప్ర‌క‌టించింది. నిజానికి.. చాలా రోజులుగా వైద్యులు చాలా ప్ర‌మాద‌క‌ర‌మైన ప‌రిస్థితుల్లో సేవ‌లు అందిస్తున్నారు. అయితే..ప్ర‌త్యేక బ‌యోసూట్స్ అందుబాటులోకి వ‌స్తుండ‌డంతో వైద్యులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా డీఆర్‌డీవో సైంటిస్టుల‌పై ప్ర‌జ‌లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఇక పూర్తి ర‌క్ష‌ణ‌లో క‌రోనా బాధితుల‌కు వైద్యుల‌కు చికిత్స చేయొచ్చున‌ని అంటున్నారు. నిజానికి.. ప‌లువురు నిర్ల‌క్ష్యంగా ఉండ‌డం వ‌ల్ల క‌రోనా బారిన‌ప‌డుతున్నారు. 

 

నిజానికి.. ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా అనేక మంది వైద్యులు ఇప్ప‌టికే కరోనా వైర‌స్ బారిన‌ప‌డ్డారు. ఢిల్లీలో, మ‌హారాష్ట్రలో ఈ సంఖ్య ఎక్కువ‌గా ఉంది. ఇటీవ‌ల ముంబైలోని వోక్‌హార్ట్ ఆస్ప‌త్రిలో ఏకంగా 26మంది న‌ర్సులు, ముగ్గురు డాక్ట‌ర్లు క‌రోనా బారిప‌డ్డారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో డీఆర్‌డీవో వైద్యుల కోసం బ‌యోసూట్‌ను త‌యారు చేయ‌డం మంచి ప‌రిణామ‌మ‌ని ప‌లువురు విశ్లేష‌కులు అంటున్నారు. కాగా,  భారత్‌లో కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తోంది.గడచిన 24 గంట( బుధ‌వారం సాయంత్రం 4గంట‌ల వ‌ర‌కు)ల్లో కొత్తగా 773 మందికి కోవిడ్‌-19 సోకినట్లు నిర్ధారణ కాగా 32 మంది మరణించారు.  దేశవ్యాప్తంగా  నేటి వరకు 5,194 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకొని 402 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. కోవిడ్‌-19 బారినపడి 149 మంది చనిపోయారని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: