ముంబైలో రోజురోజుకు క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య అధిక‌మ‌వుతుండ‌టంతో అక్క‌డి రాష్ట్ర ప్ర‌భుత్వం క‌ఠ‌న‌చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఎంత చెప్పినా కొంత‌మంది ఆక‌తాయిలు బైక్‌ల‌తో రోడ్ల‌మీద‌కు వ‌స్తుండ‌టంతో ఏకంగా జైలుకు పంపేందుకు కూడా వెన‌కాడ‌టం లేదు. దేశ‌ వ్యాప్తంగా క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతుండ‌గా అత్య‌ధికంగా ముంబై నుంచే ఎక్కువ‌గా ఉండ‌టం గ‌మ‌నార్హం. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం లాక్‌డౌన్ స‌క్ర‌మంగా అమ‌లు చేయ‌డం లేద‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఆగ్ర‌హంతో ఉంది. దీంతో లాక్‌డౌన్ అమ‌లును రాష్ట్ర ప్ర‌భుత్వం చాలా సీరియ‌స్‌గా తీసుకుంది. 

 

ఇందులో భాగంగానే  ముంబైలో ఇకపై బహిరంగ ప్రదేశాల్లో విధిగా ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించాలని బృహన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఏ కారణంతో బయటకు వచ్చినా విధిగా మాస్క్‌ ధరించాలని, ఇంట్లో తయారుచేసుకున్న మాస్క్‌ను సైతం అనుమతిస్తామని బీఎంసీ ఒక ప్ర‌క‌ట‌న‌లో  పేర్కొంది. మాస్క్‌ ధరించని వారిని అరెస్ట్‌ చేసేందుకు వెనుకాడమని అధికారులు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. త‌ప్ప‌నిస‌రి అయితే త‌ప్పా ప్ర‌జ‌లెవ‌రూ రోడ్ల‌పైకి రావ‌ద్ద‌ని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఒక‌వేళ అత్య‌వ‌స‌ర ప‌నుల‌పై బ‌య‌ట‌కు వ‌చ్చేవారు విధిగా ముఖాల‌కు మాస్కు ధ‌రించాల‌ని ఆదేశించారు. 

 

వైరస్‌ కేసులు ముంబై సహా మహారాష్ట్రలో విపరీతంగా పెరుగుతుండటంతో సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే  ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.  మహమ్మారిపై పోరాటానికి చేతులు కలపాలని మాజీ రక్షణ, ఆరోగ్య సేవల సిబ్బందికి ఉద్ద‌వ్ ఠాక్రే పిలుపునిచ్చారు. లాక్‌డౌన్‌తో ప్రజలకు అసౌకర్యం తప్పదని, అయితే అంతకుమించి మరో మార్గం లేదని  స్పష్టం చేశారు. మరోవైపు మహమ్మారి విస్తరిస్తున్న క్రమంలో ముంబైలో లాక్‌డౌన్‌ను పొడిగించేందుకు అధికారులు యోచిస్తున్నారు. ముంబైలో ఇప్పటివరకూ 318 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 50 మంది మరణించారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: