దేశంలో కరోనా ని అరికట్టేందుకు లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ లాక్ డౌన్ సమయంలో ఎవరూ బయటకు రాకుండా ఉండాలని ఆంక్షలు విధించారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.. కొన్ని చోట్ల కరోనా టెస్టులు చేయాలంటే సామాన్యులకు భారంగా ఉంటుంది.  ప్రైవేట్ ల్యాబ్స్ లో అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్నారని.. దాంతో సామాన్యులు కరోనా టెస్టులు చేసుకోవాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. దీనిపై కరోనా పరీక్షలు ఉచితంగా చేయాలన్న పిల్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. కరోనా పరీక్షల కోసం దేశవ్యాప్తంగా 118 ల్యాబ్ లు ఉన్నాయని సుప్రీంకోర్టుకు తెలిపారు సొలిసిటర్ జనరల్.

 


అయితే  ప్రస్తుత పరిస్థితుల్లో 118 ల్యాబ్స్ సరిపోవన్న సొలిసిటర్ జనరల్.. 47 ప్రైవేట్ ల్యాబ్‌లను కరోనా పరీక్షలకు ఉపయోగిస్తున్నామని తెలిపారు. మంచి గుర్తింపు పొందిన  ప్రైవేట్ లేబొరేటరీల్లో జరుగుతున్న కోవిడ్ టెస్టుల్ని ఫ్రీగా నిర్వ‌హించాల‌ని ఈ విషయం మీద త్వర‌లోనే ఉత్తర్వులు కూడా జారీ చేస్తామని అత్యున్నత ధ‌ర్మాస‌నం వెల్ల‌డించింది. అలాగే కోవిడ్ టెస్టుల కోసం ప్రభుత్వాల‌ నుంచి రీయింబర్స్ మెంట్ పాలసీను కూడా అందుబాటులోకి తీసుకురావాల‌ని తెలిపింది. 

 


ఎన్ని కట్టు దిట్టాలు చేస్తున్న రోజు రోజుకీ కరోనా కేసులు మాత్రం పెరిగిపోతూనే ఉన్నాయి.  సుప్రీం సూచనలపై స్పందించిన‌ సొలిసిటర్ జనరల్  తుషార్ మెహతా దీనిపై పరిశీలించి త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని వెల్ల‌డించారు. మరోవైపు  వైద్యసిబ్బందికి.. పీపీఈలు, భద్రత అంశాలపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. లాక్ డౌన్ ని సీరియస్ గా పాటించాలని అంటున్నారు అధికారులు. 

 

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: