తెలంగాణలో పార్లమెంట్  ఎన్నికల్లో కేసిఆర్ కూతురు కవితపై  బిజెపి అభ్యర్థి బండి సంజయ్ భారీ ఓట్లతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో  కవిత ను ఓడించి ధర్మపురి అరవింద్ గెలిచినప్పుడు నుంచి.. టిఆర్ఎస్ నాయకులు ధర్మపురి అరవింద్ పై ఎన్నో ఆరోపణలు చేస్తూనే వచ్చారు. తాజాగా మరోసారి సంచలన ఆరోపణలు చూశారు టిఆర్ఎస్ నేతలు . ప్రస్తుతం టీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలు నిజాంబాద్ ధర్మపురి అరవింద్ ఎన్నో చిక్కులు తెచ్చిపెట్టేలాగే  కనిపిస్తున్నాయి. ఇంతకీ ధర్మపురి అరవింద్ పై టిఆర్ఎస్ శ్రేణులు చేస్తున్న ఆరోపణలు ఏమిటి అంటే... ఎన్నికల నామినేషన్ల సమయంలో బీజేపీ అభ్యర్థిగా ఉన్న ధర్మపురి అరవింద్ ఆయన చదువులకు సంబంధించిన వివరాలను తప్పుగా ఎన్నికల సంఘానికి సమర్పించారని దీనిపై వెంటనే ఎన్నికల సంఘం స్పందించి చర్యలు తీసుకోవాలంటూ.. టిఆర్ఎస్ పార్టీకి చెందిన వై సతీష్ రెడ్డి అనే వ్యక్తి సోషల్ మీడియా వేదికగా తెలిపారు. 

 

 

 సతీష్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా ఉన్నారు. అయితే ఎన్నికల  సమయంలో నిజాంబాద్ ఎంపి  ధర్మపురి అరవింద్  దాఖలు చేసిన నామినేషన్ పత్రాలు అఫిడవిట్ కి  సంబంధించిన ఫోటోలు ఈరోజు సతీష్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. అయితే ధర్మపురి అరవింద్ నామినేషన్లు దాఖలు చేసిన ప్రకారం జనార్దన్ రాయ్ నగర్ రాజస్థాన్ విద్యపీట్ అనే విశ్వవిద్యాలయం నుంచి ధర్మపురి రవి ఎంఏ పొలిటికల్ సైన్స్ పూర్తి చేసినట్లుగా ఉండగా... అది కూడా 2018 సంవత్సరంలో ఆయన చదువులు పూర్తి చేసినట్లుగా ఉంది. 

 

 

 అయితే అలాంటి విద్యా సంస్థలు భారతదేశంలో చాలానే ఉన్నాయి అని భావించిన టిఆర్ఎస్ నేత సతీష్ రెడ్డి... ఎంపీ అరవింద్ తప్పుడు సమాచారం ఇచ్చారు అంటూ ఆరోపించారు.  అయితే ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరైనా..  నామినేషన్ పాత్రలతో  పాటు వ్యక్తిగత వివరాలు ఆస్తులు అప్పుల వివరాలతో పాటు.. విద్యార్హత  కేసుల వివరాలను కూడా క్లుప్తంగా వివరించాల్సి ఉంటుంది. ఇలాంటి వివరాలను ఏదైనా తప్పు అంటే అది ఎన్నికల నియమావళికి విరుద్ధం  అవుతుంది. ఈ క్రమంలోనే ఎంపీ ధర్మపురి అరవింద్ విద్యార్హతలు ఎన్నికల్లో అఫిడవిట్లు చూపినవి పూర్తిగా అవాస్తవం  అంటూ టిఆర్ఎస్ నేత సతీష్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. ధర్మపురి అరవింద్ పార్లమెంట్ కు వెళ్లేందుకు ముమ్మాటికి అనర్హుడే అని  తెలిపిన సతీష్ రెడ్డి ... ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకుగాను వెంటనే చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. మరి ఇది ఎక్కడి వరకూ దారితీస్తుంది అన్నది మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: