ప్రస్తుతం ప్రపంచంలో ఆ మూలాన చుసిన ఒకే ఒక్క విషయం కరోనా... ఈ మహమ్మారి ప్రపంచంలో 14 లక్షల మందిని పట్టి పీడిస్తుంది.అంతేనా 70000 మందిని ఇప్పటి వరకు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇంకా లెక్కకు రాని వారెందరో మనకు తెలియదు. ఈ దెబ్బతో ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు లాక్ డౌన్ ని పాటిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వం ఎన్ని చెప్పిన కొందరు మూర్ఖులు మాత్రం ప్రభుత్వం మాట వినిపించుకోవడం లేదు. కొందరు ఏమి కాదన్నట్టు బయట తిరుగుతూనే ఉన్నారు. ఇక అసలు విషయానికి వస్తే.. 


కరోనా విజృంభిస్తున్న సమయంలో లాక్‌ డౌన్‌ నిబంధనను ఉల్లఘించి వివాహం చేసుకున్న దక్షిణాఫ్రికా నూతన వధువరులను, వారితోపాటు మరో 50 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పెళ్లికుమారుడు, పెళ్లికుమార్తె అయిన జబులని జులు(48), నొమ్తాండాజో మెక్‌జీ(38) లు వీరిద్దరు ఆదివారం విహహం చేసుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న అక్కడి దక్షిణాఫ్రికా పోలీసులు అక్కడికి వెళ్లి వధువరులతో సహా కుటుంబ సభ్యులను, మొత్తం బంధువులను సైతం అరెస్టు చేసి తీసుకెళ్తున్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ గా మారాయి. 

 

 

ఇకపోతే దక్షిణాఫ్రికాలో ప్రస్తుతం అక్కడ కరోనా వైరస్‌ విజృభిస్తుండడంతో అక్కడ లాక్‌ డౌన్‌ అమలవుతోంది. ఈ నేపథ్యంలోనే బహిరంగ సమావేశాలు, వివాహా వేడుకలు, ఇంకా ఇతర కార్యక్రమాలపై అక్కడి ప్రభుత్వం నిషేధాన్ని విధించింది. ఈ పరిస్థితి రిచర్డ్స్‌ లో వివాహ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు స్థానికుల సమాచారం ఇవ్వడంతో పోలీసులు హుటాహుటిన అక్కడి వచ్చేసారు. దాంతో అక్కడ ఉన్న నూతన వధువరులతో  పాటు పెళ్లికి హజరైన మొత్తం 50 మంది బంధువులను పోలీసులు అరెస్టు చేసి రిజర్డ్స్‌ పోలీసు స్టేషన్‌ కు పంపించారు. అంతే కాకుండా సోమవారం అరెస్ట్ చేసిన అందరిని కోర్టుకు తరలించినట్లు పోలీసు అధికారి తెలిపారు. దీనితో వారిని విచారించిన కోర్టు రూ. 4100 ఇండియన్‌ కరెన్సీ లో జరిమాన విధించినట్లు అక్కడి పోలీసులు పేర్కొన్నారు. నిజానికి కొంతమందికి ఎంత చెప్పిన ఎవరి మాట వినరు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: