దేశవ్యాప్తంగా కరోనా హాట్‌స్పాట్స్‌ వేగంగా పెరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్న ప్రాంతాలను హాట్‌స్పాట్‌లుగా గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. ఇక దేశంలో మొత్తం 5194 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. 24 గంటల్లో 773 కేసులు నమోదైనట్టు వెల్లడించిన ఆయన కరోనా కారణంగా 149 మంది ప్రాణాలు కోల్పోయినట్టు చెప్పారు.  ఇక మహారాష్ట్రలో అత్యధిక కేసులు(1018) కేసులు నమోదయ్యాయి.

 

ఈ రాష్ట్రంలో మరణాల సంఖ్య కూడా 64కు చేరింది. తాజా సమాచారం ప్రకారం ఏపీ-329, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ – 10, అరుణాచల్ ప్రదేశ్ – 1, అస్సాం – 27, బీహార్ – 38, ఛండీగర్-18, ఛత్తీస్‌ఘడ్‌-10, ఢిల్లీ-576, గోవా-7, గుజరాత్-165, హర్యానా-147, హిమాచల్‌ప్రదేశ్-18, జమ్ముకశ్మీర్-116, జార్ఖండ్ – 4, కర్ణాటక- 175, కేరళ-336, లడాక్-14, మధ్యప్రదేశ్‌-229, మహారాష్ట్ర-1018, మణిపూర్‌-2, మిజోరం- 1, ఒడిశా – 42, పుదుచ్చేరి -5, పంజాబ్-91, రాజస్థాన్-328, తమిళనాడు-690, తెలంగాణ-364, త్రిపుర – 1, ఉత్తరాఖండ్ – 31, యూపీ-326, పశ్చిమ బెంగాల్-99 కేసులు ఉన్నాయి. 

 

కరోనా హాట్‌స్పాట్లలో లాక్‌డౌన్‌ మరింత కట్టుదిట్టం చేస్తున్నట్టు తెలిపారు. నిత్యావసరాల సరఫరాను సాధారణ స్థాయికి తెచ్చామన్నారు. అయితే  కరోనా మహమ్మారితో పోరాడి 402 మంది కోలుకున్నారని ఆయన తెలిపారు. కాగా, గౌతమ్‌ బుద్ధ నగర్, ఢిల్లీ, ముంబై, పుణె, నాగపూర్‌, ఇండోర్, కాసర్‌గోడ్, కన్నూర్‌, కొయంబత్తూరు, చెన్నై, హైదరాబాద్‌లు కరోనా హాట్‌స్పాట్‌లుగా మారిపోయాయి. మహారాష్ట్ర, ఢిల్లీల్లో ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: