తెలంగాణ క‌రోనా పాజిటివ్  కేసుల సంఖ్య పెరుగుతుండ‌టంతో ముంద‌స్తు చ‌ర్య‌ల్లో రాష్ట్ ప్ర‌భుత్వం వేగం పెంచింది. ఎలాంటి ప‌రిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేందుకు స‌న్నాహాలు ఆరంభించింది. ముఖ్యంగా వైద్య స‌దుపాయాల్లో, సౌక‌ర్యాల్లో ఇబ్బందులు ఎదురుకాకుండా చాలా వేగంగా చ‌ర్య‌ల‌ను ఆరంభించింది. ఇప్ప‌టికే రాష్ట్రంలో గాంధీ, చెస్ట్ ఆస్ప‌త్రుల‌తో పాటు ఆయా జిల్లా కేంద్రాల్లో క్వారంటైన్‌, క‌రోనా పాజిటివ్ రోగుల‌కు చికిత్స అంద‌జేస్తున్నారు. ఇక గ‌చ్చిబౌళిలోని క్రీడాగ్రామంలో కూడా 1500మందికి వైద్యం అందించేలా గ‌దుల‌ను సిద్ధం చేసిన విష‌యం తెలిసిందే. 

 

ఇక తాజాగా రాష్ట్ర ప్ర‌భుత్వం రైల్వేశాఖ సాయంతో కాచిగూడ  రైల్వేస్టేష‌న్‌లో రైళ్ల‌ల‌ను నిలిపి తాత్కాలిక ఐసోలేష‌న్ వార్డులుగా ఏర్పాటు  చేస్తున్నారు.  ఇందుకు సంబంధించిన ప‌నులు కూడా ఇప్ప‌టికే మొద‌లు కావ‌డం గ‌మ‌నార్హం. మిగ‌తా ప‌నుల‌ను కూడా త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేసేందుకు వేగంగా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. రైల్వే స్టేషన్‌లో మూడు రోజుల్లో ఐసోలేషన్‌ కోచ్‌లు అందుబాటులోకు రానున్నాయి. దక్షిణమధ్య రైల్వే పరిధిలోని హైదరాబాద్‌ డివిజన్‌లో కేవలం కాచిగూడ రైల్వే స్టేషన్‌లో మాత్రమే వీటిని అందుబాటులో ఉంచాలని రైల్వే అధికారులు నిర్ణయించారు.

 

 అంతేకాకుండా కాచిగూడ రైల్వే స్టేషన్‌లో 40 ఐసోలేషన్‌ కోచ్‌లు అందుబాటులో ఉంచుతున్న‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. ఇప్పటికే 19 బోగీలను ఐసోలేషన్‌ కోచ్‌లుగా మార్చిన‌ట్లు అధికారులు స్ప‌ష్టం చేశారు.  మిగతా బోగీల్లో పనులు చురుకుగా సాగుతున్న‌ట్లు చెప్పారు.  ఒక్కో కోచ్‌లో 13 మంది కరోనా అనుమానితులకు చికిత్స అందించే అవకాశం ఉంటుంది. మొత్తం 500 మందికి చికిత్స అందించే అవకాశం ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు.  ఇక రైల్వేస్టేష‌న్ల‌లో ఐసోలేష‌న్ వార్డుల ఏర్పాటు ప్ర‌క్రియ దేశ వ్యాప్తంగా వేగిరం అవుతోంది. రైల్వే కోచ్‌లు ఐసోలేషన్ వార్డులుగా చక్కగా ఉపయోగపడుతుండడంతో హైదరాబాద్‌లోనూ ఆ చర్యలను అనుసరిస్తున్నారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: