ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఓ ప్రకటన విడుదల చేశారు. రేపు అనగా గురువారం రాత్రి 9 గంటలకు సోషల్ మీడియా ద్వారా ప్రజల ముందుకొచ్చి మాట్లాడతానని, దాన్ని అందరూ ట్విట్ట‌ర్‌లో ఫాలో అవ్వాలని స్వయంగా ట్వీట్ చేశారు. కరోనా కలకలం మన దేశాన్ని ఊపేస్తున్న తరుణంలో అసద్ భాయి ఏం చెబుతారన్న ఆసక్తి ఇప్పుడు అంద‌రిలోనూ వ్య‌క్త‌మ‌వు తోంది.నిజాముద్దీన్ లోని మర్కజ్ కు వెళ్లొచ్చిన త‌బ్లీగిల‌తోనే  కరోనా వైరస్ అనూహ్యంగా వ్యాపించిందన్న విమ‌ర్శ‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈనేప‌థ్యంలో అస‌ద్ ఆ విష‌యాన్ని క‌దిలించేందుకే మీడియాతో మాట్లాడేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లుగా మీడియా వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. 

 


ఇదిలా ఉండ‌గా ఒక్క ఢిల్లీలోనే కాదు.. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో కూడా తబ్లిగీల ప్రవర్తన డాక్ట‌ర్ల‌ను, న‌ర్సుల‌ను అవ‌మానించేలా ఉందంటూ విమ‌ర్శ‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇది జ‌రిగిన మ‌రునాడే  అటు నిజమాబాద్‌లో వైద్య సిబ్బందిపై ముస్లింలు దాడుల‌కు పాల్ప‌డిన విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఇక ప్రభుత్వాధికారుల మీద కూడా కొంత‌మంది యువ‌కులు రాళ్ల‌దాడికి పాల్ప‌డిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. అయితే కొంత‌మంది దురుసు ప్ర‌వ‌ర్త‌న వ‌ల్ల మొత్తం ముస్లిం స‌మాజానికి చెడ్డ‌పేరు వ‌స్తోంద‌ని బాధ‌ప‌డుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువ‌గానే ఉండ‌టం గ‌మ‌నార్హం. 

 

మ‌ర్క‌జ్‌నిజాముద్దీన్‌కు  వెళ్లి వ‌చ్చిన ప‌లువురు ఇంకా అజ్ఞాత‌వాసంలో ఉన్నార‌న్న ఆరోప‌ణ‌లున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో ముస్లిం స‌మ‌జానికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న అస‌దుద్దీన్ ఒవైసీ రేపు ఏం మాట్లాడ‌బోతున్నారు అనే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. దురుసుగా ప్ర‌వ‌ర్తించిన కొంత‌మంది ముస్లిం యువ‌త‌ను త‌ప్పుబ‌డ‌తారా..?  లేదా పాల‌కుల‌ను, హిందు స‌మాజంపై ఎదురు దాడి చేస్తారా..? అంటూ  ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు.  గురువారం షబ్-ఎ-బరాత్ ను పురస్కరించుకొని రాత్రి 9 గంటలకు అసదుద్దీన్ ఏం మాట్లాడతారన్నది దేశమంతా ఆసక్తిగా గమనిస్తోంది.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: