భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇందిరిగాంధీ తరువాత ఈ దేశాన్ని ఓ విధంగా శాసిస్తున్న మహా నాయకుడుగా ఉన్నారు. అలాగే ప్రపంచ దేశాలలో భారత్ కీర్తిని ఇనుమండింపచేస్తున్న నేతగా కూడా ఆయన పేరు మారుమోగుతోంది. ఇప్పటిదాకా మోడీ ద్వారా భారత్ కీర్తి అధికమైంది తప్ప ఎక్కడా తగ్గలేదు.

 

 

అటువంటిది మోడీ తెలిసో తెలియకో తప్పు చేశారా అన్న కామెంట్స్ వస్తున్నాయి. కరోనా వైరస్ ని మందు లేదు.  ఉన్నంతల్లో మలేరియాకు వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఒక్కటే బాగా పనిచేస్తోందన్నద్ది ఇప్పటివరకూ పరీక్షల్లో తేలిన విషయం. దాంతో దానికి యమ డిమాండ్ వచ్చిపడింది. భారత్ లో హైడ్రాక్సీ క్లోరోక్విన్ తయారీ అధికంగా ఉంది. దాంతో పాటుగా మనకు కూడా కరొనా వైరస్ తాకిడి ఎక్కువగా ఉంది.

 

ఈ నేపధ్యంలో  హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమ‌తిపై నిషేధాన్ని కేంద్ర విదేశాంగ శాఖ విధించింది. ముందు మన భారతీయులకు సరిపడా మందు నిల్వలు చూసుకుని ఆనక ఇతర దేశాలకు సరఫరా చేయాలన్నది భారత్ ఆలోచన. ఇదిలా ఉండగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మాత్రం నోరు జారేశారు. భారత్  హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందుని సరఫరా చేయకపోతే ప్రతీకారం తీర్చుకుంటామంటూ గట్టిగానే మాటలు వాడారు.

 

అయితే భారత్ అప్పటికే  హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమ‌తిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసి కరోనా బాధిత దేశాలను ఆదుకోవాలని ఒక కీలక నిర్ణయం తీసుకుందిట. దానికి కారణం మన ఔదార్యంతో పాటు, మన వద్ద  హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందు నిల్వలు కూడా ఎక్కువగా ఉన్నాయి. దాంతో ఇలా నిషేధం ఎత్తేయడం, అలా  హైడ్రాక్సీ క్లోరోక్విన్ సరఫరా చేయడం ఒకేసారి జరిగాయి.

 

ఇది తన ఘనతగా ట్రంప్ ఇపుడు తెగ ఫీల్ అవుతున్నాడు. అదే సమయంలో ట్రంప్ కి మోడీ భయపడినట్లుగా కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. మరో వైపు సగటు భారతీయుల్లో కూడా  ఇదే రకమైన భావన ఉంది. దీని మీద విదేశాంగ శాఖ ద్వారా అయినా మోడీ కీలకమైన ప్రకటన ఇప్పించి ఉండాల్సింది. తాము ఔదార్యమంతో ప్రపంచ దేశాలను ఆదుకోవడానికి హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమ‌తిపై ఉన్న నిషేధాన్ని ఎత్తేశామని గట్టిగా చెప్పించి ఉండాల్సింది.

 

ఇపుడు అలా చేయకపోవడం వల్ల ట్రంప్ కి భయపడే భారత్ నిషేధం ఎత్తివేసిందన్న భావన  అంతటా కలుగుతోంది. అదే సమయంలో భారత్ ఇన్నాళ్ళుగా అంతర్జాతీయంగా ఆర్జించుకున్న పరువు, గర్వం కూడా కొంతలో కొంత దెబ్బ తిన్నాయని కూడా అంతా భావిస్తున్నారు. ఈ విషయంలో మాత్రం మోడీ పెద్ద తప్పు చేశారని, ట్రంప్ వాచాలత్వానికి తగిన జవాబు చెప్పించి ఉండాల్సింది అన్న మాట మాత్రం గట్టిగాన వినిపిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: