దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కరోనా ను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం జనతా కర్ఫ్యూ నీ విధించింది...అయిన కరోనా ఎక్కడ కట్టడి చేసిన దాఖలు లేవు.. అయితే ఇప్పుడు కరోనా ప్రభావం ఎక్కడ తగ్గక పోగా ఇంకా పెరిగింది..కరోనా ను అరికట్టేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం ఈ మేరకు లాక్ డౌన్ కూడా ప్రకటించింది.. ప్రజలు బయటకు కదలలేని పరిస్థితి నెలకొంది.. రెండు చేతుల పనిచేస్తే కానీ నాలుగు వేళ్ళు నోటిలోకి వెళ్ళ వు అలాంటి పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలవడానికి సినీ తారలు కదిలి వచ్చారు.. 

 

 

 

ప్రముఖులు కూడా వారికి తోచిన సాయన్ని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందజేస్తున్నారు.. అయినా కరోనా వ్యాప్తి మాత్రం ఎక్కడ తగ్గలేదు.. ..అందుకే కరోనా ప్రభావాన్ని పూర్తిగా తగ్గించేందుకు ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది.. ఈ మేరకు జనతా కర్ఫ్యూ నీ కూడా ప్రకటించింది.. కరోనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ విధించింది .ఈ మేరకు ప్రజలు బయటకు రాకూడదని సూచించింది.. అయితే కరోనా ప్రభావం మరింత ముదిరింది. ఇప్పటికే తెలంగాణలో 404కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. 

 

 

 

 

వివరాల్లోకి వెళితే.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య మరింత పెరిగింది. ఇప్పటివరకు 27,250 మంది కరోనా వల్ల మృతి చెందారు. 5.94 లక్షల మందికి కరోనా సోకింది. ఇప్పటివరకు1.33 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇటలీలో కరోనా మృతుల సంఖ్య 9,134, స్పెయిన్‌లో 5,138 కాగా, అమెరికాలో ఇప్పటి వరకు 1,477 మంది ప్రాణాలు కోల్పోయారు.దినం మారే కొద్దీ కరోనా కేసులు కూడా పెరుగుతూ వస్తున్నాయి.. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో కరోనా బారిన పడి ప్రాణాలను కోల్పోయారు.. 

 

 

 

ఇక భారత దేశంలో ఇప్పటికే 5000 కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.. అయితే తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణలో కరోనా ప్రభావం కాస్త ఎక్కువగానే ఉందన్న విషయం తెలిసిందే.. అయితే తెలంగణా లో కరీంనగర్ లో చాలా ఎక్కువగా ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సభ్యులు తేల్చి చెప్పారు.. అదే విధంగా అండ్రప్రదేశ్ లో కరోనా ప్రభావం తక్కువగానే ఉంటుంది అని తెలుస్తుంది.. ఇంకా ఎంత మంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంటుంది అనే విషయాలు ప్రజలను వణికిస్తున్నాయి.. రోజు రోజు కు పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ పొడిగించనున్నట్లు  వార్తలు వినపడుతున్నాయి...

మరింత సమాచారం తెలుసుకోండి: