భారతదేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న  నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధిస్తూ కీలక  నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రజలందరూ ఇంటికే పరిమితం అయ్యేలా చేసి...రవాణా వ్యవస్థను  దేశవ్యాప్తంగా రద్దు చేసి లాక్ డౌన్  అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది . అయితే దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో విమానయాన సర్వీసులు రద్దు అయిన విషయం తెలిసిందే. కేవలం విమానయాన సర్వీసులు కాదు రోడ్డు రవాణా సంస్థ సహా రైలు రవాణా కూడా పూర్తిగా నిలిచిపోయింది. అయితే ఏప్రిల్ 15 తర్వాత కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్  పూర్తవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విమాన సర్వీసులు పునరుద్ధరించేందుకు ఆయా విమానయాన సంస్థలు సిద్ధమవుతున్నాయి. 

 

 

 ఈనెల 15 నుంచి టికెట్ల బుకింగ్ ప్రారంభమవుతుంది అంటూ పలు విమానయాన సంస్థలు ఇప్పటికే ప్రకటనలు విడుదల చేశారు. అయితే దీనిపై స్పందించిన పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా.. ఏప్రిల్  15 తర్వాత లాక్ డౌన్  పూర్తయినప్పటికీ... విమాన ప్రయాణాలు పై ఆంక్షలు కొనసాగుతాయి ఉంటూ ఆయన వెల్లడించారు. దేశంలో పరిస్థితి అదుపులోకి వచ్చేంతవరకు... కరోనా  వైరస్ నియంత్రణ జరిగేంత వరకు... దేశి  అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలు  అలాగే కొనసాగుతాయి అంటూ స్పష్టం  చేశారు. 

 

 అయితే కేంద్రం ప్రకటనకు ఆటో విమానయాన సంస్థలు కూడా మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే స్పందించిన ఇండిగో  విమానయాన సంస్థ... ఈ నెల ఆఖరి వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులను పూర్తిగా నిలిపి వేస్తున్నట్లు స్పష్టం చేసింది. అయితే కరోనా  వైరస్ పై  పోరాటంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కి  సహకరించిన ప్రతి ఒక్కరికి పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ ధన్యవాదాలు తెలిపారు. అయితే ప్రస్తుతం ఏప్రిల్ 14వ తేదీన ముగియనున్న లాక్ డౌన్  గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. దేశంలో రోజురోజుకు కరోనా  వైరస్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో గడువు పొడిగించే అవకాశం ఉందని బలంగా వాదన వినిపిస్తోంది. ఏప్రిల్ 14 తర్వాత ఏం జరగబోతోంది అన్నది మాత్రం తెలియాల్సి ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి: