చైనా దేశంలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచంలో అన్ని దేశాల ప్రజలను అతలాకుతలం చేస్తోంది. ఈ వైరస్ వల్ల చాలా మంది ప్రజలు చనిపోయారు. దాదాపు పది లక్షలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ప్రపంచ వ్యాప్తంగా నమోదు అవుతున్నాయి. మందు లేకపోవటంతో ప్రపంచ దేశాలు అన్నీ వైరస్ వ్యాప్తి చెందకుండా నియంత్రణ ఒకటే మార్గం కావటంతో… చాలా వరకు దేశాలు అన్ని లాక్ డౌన్ ప్రకటించడం జరిగాయి. ఈ దెబ్బతో ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం భారీ స్థాయిలో ఏర్పడింది. అంతేకాకుండా ఈ వైరస్ వల్ల కొన్ని దేశాల ప్రధానులు మరియు మంత్రులు కూడా అనేక అవస్థలు పడటంతో ఈ వైరస్ కి కారణమైన చైనా అన్ని అన్ని దేశాల ప్రజలు మరియు నాయకులు విమర్శిస్తున్నారు.

 

మరోపక్క అగ్రరాజ్యం అమెరికా కరోనా వైరస్ వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు ఆర్థికంగా చాలావరకు నష్టపోవడంతో...ఇంత ప్రమాదకరమైన వైరస్ గురించి ప్రపంచాన్ని అల్లరి చేయకుండా సైలెంటుగా ఉన్న చైనాని అంతర్జాతీయ న్యాయస్థానానికి లాగటానికి ప్రయత్నాలు స్టార్ట్ చేసింది. ఈ తరుణంలో చైనాలో సి.ఐ.ఎ ద్వారా వైరస్ ఏవిధంగా ప్రపంచంలోకి వచ్చిందో దాని గురించి అమెరికా విచారణ చేయడం స్టార్ట్ చేసింది. మరోపక్క ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల ప్రజలు చైనా దేశం నుండి వచ్చే వస్తువులను కొనడం అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేయడం స్టార్ట్ చేశాయి.

 

ఈ దెబ్బతో కరోనా వైరస్ ఎఫెక్ట్ కి చైనా దేశం నుండి బయటకు వచ్చిన రెండు యాప్ లను బాయ్ కట్ చేయటం స్టార్ట్ చేశారు. ఆ రెండు యాప్ లు టిక్‌టాక్, జూమ్ యాప్. బ్యాన్ టిక్ టాక్ అంటూ హ్యాష్ ట్యాగ్ తో జోరుగా నెటిజన్ల మధ్య చర్చ జరుగుతోంది. ఆ దేశ ప్రొడక్ట్స్ అన్నింటినీ బ్యాన్ చేద్దాం అంటూ ఇంకొందరు గళం విప్పుతున్నారు. దీంతో టిక్‌టాక్ యాప్ కి బాగా అలవాటు పడినవారికి ఈ వైరస్ దెబ్బకి ఊహించని విధంగా కొంపలు మునిగినట్లు దెబ్బ గట్టిగా పడింది. చాలా దేశాలలో ప్రజలు చైనా కి సంబంధించిన టిక్‌టాక్ యాప్ ని బాయ్ కట్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: