ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో వై.ఎస్.జగన్ ని విమర్శలు చేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగం చాలా నిర్లక్ష్యంగా పని చేస్తుందని విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా సీఎం జగన్ అయితే ప్రజల ప్రాణాలతో ఆట ఆడుకుంటున్నారు అని...కరోనా వైరస్ కట్టడి చేయడంలో ఫెయిల్ అయ్యారని అంటూన్నారు. తాజాగా మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కరోనా వైరస్ నియంత్రణ విషయంలో జగన్ సర్కార్ విఫలమైందని స్టేట్ మెంట్ ఇచ్చారు. దాదాపు 37 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నా యనమల రామకృష్ణుడు ఇష్టానుసారం గా వైయస్ జగన్ సర్కార్ పై విమర్శలు చేశారు. అసలు అర్ధం లేని వ్యాఖ్యలు చేశారు. 

 

అసలు కరోనా కట్టడి చేయడం విషయంలో ఎక్కడ విఫలమైంది అన్న దాని గురించి ఏం మాట్లాడకుండా... దేశంలోనే కరోనా వైరస్ ఇంత దారుణంగా విజ్రంభీంచడానికి కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నట్టు దాని వెనకాల జగన్ ఉన్నట్టు యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. వాస్తవానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ అరికట్టడంలో ఢిల్లీ మర్కజ్ మజీద్ ఘటన బయట పడక ముందు వరకు చాలా కంట్రోల్ లో ఉంది. ఎప్పుడైతే ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లినవారికి కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు బయట పడటం జరిగిందో ఏపీతో పాటు దేశ వ్యాప్తంగా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా ఊహించని విధంగా పెరిగిపోయాయి.

 

అయితే ఈ సందర్భంలో యనమల రామకృష్ణుడు ఎక్కడా కూడా మర్కజ్ మసీదు ఘటన గురించి మాట్లాడకుండా కేవలం వైఎస్ జగన్ పనితనాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేయడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రస్థాయిలో యనమలకు షాక్ ఇచ్చే విధంగా కౌంటర్ లు ఇస్తున్నారు. మర్కజ్ మసీదు గురించి మాట్లాడకుండా గవర్నమెంట్ పనితనం గురించి మాట్లాడుతున్న ఎనమల ముస్లింల ఓట్లు ఆకర్షించడానికి ట్రై చేస్తున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి టైమ్ లో కూడా మనుషుల ప్రాణాలు పోతున్న టైంలో కూడా రాజకీయాలు చేయాలంటే తెలుగుదేశం పార్టీ తర్వాతే అంటూ చాలా మంది యనమల చేసిన వ్యాఖ్యలకు విమర్శలు చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: