ఎక్కడ చుసిన ఎటు చూసిన ఒకటే మాట వినపడుతుంది.. అదే కరోనా వైరస్.. ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే.. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు దేశ దేశాలను కలపెట్టడమే కాకుండా ప్రపంచంలో అందరినీ నిద్రలేని రాత్రులను గడిపెలా చేస్తుంది .. అందుకే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా దేశాలు ఒక్కటై కరోనా ను నియంత్రణ చేసున్నాయి..

 

 

 

ఇక ఈ మహమ్మా రి కరోనా నియంత్రణ లో భాగంగా జనతా కర్ఫ్యూ ను విధించింది.. అలాగే కట్టడి చేయడాని కి ఏప్రిల్ 14 వ తేదీ వరకు లాక్ డౌన్ ను ప్రకటించింది. .ఈ మేరకు ప్రజలు ఎక్కడా బయట తిరగడం లేదని అర్థమవుతుంది.. ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటూ ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు విరాళాల ను అందిస్తున్నారు.. కరోనా ప్రభావం ఎక్కువ గా ఉండటం తో ప్రస్తుతం చిత్రీకరణ జరుపు కుంటున్న సినిమాలు వాయిదా పడ్డాయి..విడుదల సినిమా లు కూడా వాయిదా పడిన సంగతి తెలిసిందే.. 

 

 

 


గుంటూరులో అధికారులు హై అలెర్ట్ ప్రకటించారు. నగరంలో ముగ్గురి కి  కరోనా లక్షణాలు వెలుగు చూడడం తో, జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి తో సన్నిహితం గా ఉండడం తో అదే వీధికి చెందిన ఇద్దరు వ్యక్తుల కు కరోనా వచ్చినట్లు తెలుస్తుంది. దీంతో నగరంలో లాక్ డౌన్ ను పటిష్ట పరిచారు.

 

 

 

 ముందు జాగ్రత్త చర్యగా మాచర్ల తో  చుట్టూ ప్రక్కల ప్రాంతాల్లో హై అలెర్ట్ ప్రకటించారు.మాచర్ల, కారప్పూడి, మంగళగిరి నుంచి  గుంటూరు వస్తున్నా వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. మాచర్ల ,కారప్పూడి, మంగళగిరి  ప్రజలు ఎవరు బయటకు రావొద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా లాక్ డౌన్ ను పొడిగించనున్నట్లు తెలుస్తోంది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: