భారత్ చేస్తున్న సాయానికి అమెరికా రుణం తీర్చుకోవాల‌ని భావిస్తున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది. క‌రోనాతో క‌కావిక‌లం అవుతున్న అగ్ర‌రాజ్యానికి భార‌త్ హైడ్రాక్సీ క్లోరో క్వినోన్ ఎగుమ‌తికి అంగీక‌రించిన విష‌యం తెలిసిందే. అయితే ఈ చ‌ర్య వ‌ల్ల భార‌త్ మాకు ఇప్పుడు మ‌రింత ఆత్మీయ దేశంగా మారింద‌ని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ పేర్కొన‌డం గ‌మ‌నార్హం. అమెరికాలో రోజు రోజుకు వైరస్ వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాలుగు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరిగిపోతోంది. నిత్యం వేలాది కొత్త కేసులు న‌మోద‌వుతుండ‌ట‌మే కాకుండా వంద‌లాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

 

 అయితే, మొదట అమెరికా అంచనా వేసిన దానికంటే మరణాలు తక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అధ్యక్షుడు ట్రంప్ వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే.  యూఎస్ కోవిడ్ 19కు వ్యాక్సిన్ను క‌నుగొనేందుకు అమెరికా విస్తృతంగా ప‌రిశోధ‌న‌లు నిర్వ‌హిస్తోంద‌ని ట్రంప్ పేర్కొన్నారు. ఇప్పుడు  క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నామని, ట్రయల్స్ పూర్తయ్యి వ్యాక్సిన్ రెడీ అయితే మొదట ఇండియాకే  ఈ మెడిసిన్ ను ఎగుమతి చేస్తామని  భార‌త ప్ర‌ధాన‌మంత్రి మోదీకి  హామీ ఇచ్చామని ట్రంప్మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పేర్కొన‌డం గ‌మ‌నార్హం. ఈ హామీ తరువాత మోడీ హైడ్రాక్సీ క్లోరో క్వినోన్ ను ఎగుమతి చేసేందుకు అంగీకరించారని, పరస్పరం రెండు దేశాలు కరోనాపై పోరాటం చేస్తున్నాయని ట్రంప్ ఫ్యాక్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

 


చాలా దేశాల్లో కరోనా వైరస్ కు తట్టుకోవడానికి కావాల్సిన మెడిసిన్స్ లేకపోవడంతో అందరి చూపులు ఇండియా వైపు ఉన్నాయి. ఇక ఇండియాలో ఫార్మా ఇండస్ట్రీ వేగంగా అభివృద్ధి చెందింది. ఇండియా నుంచి ప్రపంచంలోనే అనేక దేశాలకు మెడిసిన్స్ ఎగుమతి అవుతుంటాయి. కరోనాకు అత్యవసర మెడిసిన్ గా వినియోగించే హైడ్రాక్సీ క్లోరో క్వినోన్ ఔషధం ఇండియాలోనే ఎక్కువగా తయారవుతుంది. అమెరికాతో సహా అనేక దేశాలు ఆ ఔషధం కోసం ఇండియాను అభ్యర్ధిస్తున్నాయి. మార్చి 25 నుంచి ఇండియా ఈ ఔషధం ఎగుమతిపై నిషేధం విధించింది. ఇండియాలో సరిపడా మెడిసిన్ ఉన్న తరువాతే బయటకు సప్లై చేయాలనీ నిర్ణయం తీసుకున్న విష‌యం తెలిసిందే. 

 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: