దేశంలో ఇప్పుడు కరోనాని కట్టడి చేయడానికి లాక్ డౌన్ కొనసాగుతుంది.  లాక్ డౌన్ సందర్భంలో దేశంలో ఎన్నో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి.. కొంత మంది లాక్ డౌన్ ఉల్లంఘన కు పాల్పడుతున్నారు.  అయితే పోలీసులు ఎన్నో రకాలుగా చెబుతున్నా పట్టించుకోండం లేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు సోషల్ మాద్యమాల్లో కొత్త కొత్త పుకార్లు పుట్టుకొస్తున్నాయి. ఓ వైపు లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటిపట్టున ఉంటున్న ప్రజలకు కొన్ని సోషల్ మాద్యమాల ద్వారా వస్తున్న మెసేజ్ లో కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.  తాజాగా  ఈ ఆదివారం సాయంత్రం 5 గంటలకు దేశ ప్రజలంతా 5 నిమిషాల పాటు లేచి నిల్చుని దేశం కోసం ఎంతో శ్రమిస్తున్న ప్రధాని మోదీకి గౌరవం ప్రకటించాలని జరుగుతున్న ప్రచారాన్ని ప్రధాని మోదీ తప్పుబట్టారు.  

 

ఆ మద్య జనతా కర్ప్యూ పాటించమని మోదీ చెప్పిన విషయం తెలిసందే.. ఇంది ఎంతో సక్సెస్ అయ్యింది. మొన్న ఆదివారం రాత్రి 9 గంటల 9 నిమిషాలకు దీపాన్ని వెలిగించి సంఘీభావాన్ని ప్రకటించమని చెప్పారు.. ఇది మంచి సక్సెస్ అయ్యింది.  అయితే ప్రపంచ నేతలు మోదీని ఎంతోగానో పొగుడుతున్నారు.. ఈ నేపథ్యంలో భారతీయ పౌరులు ఆయనకు గౌరవంగా  ఈ ఆదివారం సాయంత్రం 5 గంటలకు దేశ ప్రజలంతా 5 నిమిషాల పాటు లేచి నిల్చుని ఆయనకు సంఘీభావాన్ని ప్రకటించాని పుకార్లు పుట్టుకొచ్చాయి.

 

ఆ ప్రచారం తనను వివాదంలోకి లాగేందుకు చేపట్టిన తప్పుడు కార్యక్రమంలా కనిపించిందని వ్యాఖ్యానించారు. 'సదుద్దేశంతోనే ఇది ప్రారంభించారేమో. కానీ నా పైన నిజంగా అంత ప్రేమ, గౌరవం ఉంటే.. ఈ కరోనా సంక్షోభం ముగిసేవరకు ఒక పేద కుటుంబం బాధ్యత తీసుకోండి. అంతకుమించిన గౌరవం మరొకటి ఉండదు' అని ఆయన సోషల్ మాద్యమంలో పోస్ట్ చేశారు.

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: