గత నెల  ఢిల్లీ మ‌ర్క‌జ్ నిజాముద్దీన్‌లో త‌బ్లిగీ జమాత్ నిర్వ‌హించిన మ‌త స‌మ్మేళ‌నానికి వెళ్లి వచ్చిన తర్వాత ఎంతో మందికి కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది.  ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారి తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లడం వారికి ఈ కరోనా వైరస్ సోకడంతో వారి ద్వారా ఇతరులకు మాయదారి వైరస్ అంటుకుటుంది.  ఈ విషయంపై తెలుగు రాష్ట్రాల సీఎంలు మత పెద్దలతో సైతం ఫోన్ లో మాట్లాడి అలాంటి వారు ఉంటే వెంటనే స్వచ్చందంగా వచ్చి ట్రీట్ మెంట్ తీసుకోవాలని చెబుతూనే ఉన్నారు.  కానీ కొంత మంది ఇప్పటికీ రహస్యంగా ఉంటున్నారు.

 

 అయితే వారిని నుంచి ఈ వైరస్ వివిధ ప్రదేశాలకు వ్యాప్తి చెందుతుంది.  తాజాగా ఏపికి చెందిన 10 మంది తబ్లిగీల‌పై యూపీ పోలీసులు అంటువ్యాధుల నిరోధక చట్టం, విపత్తు నిర్వహణ చట్టం కింద కేసులు న‌మోదు చేశారు. ఏపీకి చెందిన ఈ 10 మంది గ‌త నెల ఢిల్లీ మ‌ర్క‌జ్ నిజాముద్దీన్‌లో త‌బ్లిగీ జమాత్ నిర్వ‌హించిన మ‌త స‌మ్మేళ‌నానికి హాజ‌ర‌య్యారు. ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న లాక్ డౌన్ నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ కి వెళ్ల‌కుండా యూపీకి వెళ్లారు. అక్క‌డే మ‌రో త‌బ్లిగీ స‌భ్యుడి ద‌గ్గ‌ర త‌ల‌దాచుకున్నారు.

 

బావార్చీలోని శాంగిబెగ్ ప్రాంతానికి చెందిన 50 ఏండ్ల‌ వ్యక్తి వీరికి ఆశ్రయం ఇచ్చిన‌ట్లు పోలీసులు గుర్తించారు. అందులో ఒకరికి కరోనా పాజిటీవ్ తెలడంతో వెంటేనే అధికారులు అప్రమత్తయ్యారు..  ఆ ప్రాంతాన్ని బ్లాక్ చేశారు. అత‌డిపైన‌, అత‌డి ద‌గ్గ‌ర ఆశ్ర‌యం పొందిన 10 ఏపీ వాసుల‌పైనా కేసులు న‌మోదు చేశారు. వారి నుంచి నమూనాలు సేకరించి క‌రోనా పరీక్షల కోసం పంపించారు.

 

 


కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple


 

 

మరింత సమాచారం తెలుసుకోండి: