కరోనా దెబ్బకు అగ్రరాజ్యాలే వణికిపోతున్న వేళ.. ఏపీ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. రాష్ట్రంలోనే కరోనా టెస్టింగ్ కిగ్లు, వెంటిలేటర్లు తయారీ చేస్తున్నారు. దేశంలో ఇలా ఎక్కడా లేదని, కేవలం ఏపీలోనే కరోనా టెస్టింగ్‌ కిట్లు, వెంటిలేటర్లు తయారు చేస్తున్నామన్నారు. అయితే ఈ క్రెడిట్ వైసీపీ, టీడీపీలు మాది అంటే మాది అని ప్రచారం చేస్తున్నాయి.

 

 

 

ఏపీ మెడ్‌టెక్ జోన్‌కు జోన్‌ను ఏర్పాటు చేయడం కోసం వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమీపంలో 270 ఎకరాలను అప్పటి టీడీపీ ప్రభుత్వం కేటాయించింది. 2018 చివర్లో మెడ్‌టెక్ జోన్‌ను నాటి సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. విదేశాల నుంచి వైద్య పరికరాలను దిగుమతి చేసుకుంటే ఖర్చు తడిసి మోపెడు అవుతోంది. దీంతో వైద్య పరికరాలను తక్కువ ఖర్చుతో మన దేశంలోనే ఉత్పత్తి చేసే ఉద్దేశంతో కేంద్రం చొరవతో ఈ జోన్‌ను ఏర్పాటు చేశారు. జితేందర్ శర్మ ఏపీ మెడ్‌టెక్ ఎండీ, సీఈవోగా వ్యవహరిస్తున్నారు.

 

 

కరోనా నియంత్రణ చర్యలు, ఏపీలో ప్రస్తుత పరిస్థితులపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు ఆళ్లనాని, గౌతమ్‌రెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ సవాంగ్‌ పాల్గొన్నారు. కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్‌ను సీఎం జగన్‌ పరిశీలించారు. ప్రజలకు నిత్యావసర వస్తువుల కొరత రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. 

 

 

రాజకీయాలు పక్కన బెడితే ఏపీ మెడ్‌టెక్ జోన్ అనేది భారత్‌కు ఎంతో కీలకం. ‘‘మన దేశం ఏటా రూ.50 వేల కోట్ల విలువైన వైద్య పరికరాలను దిగుమతి చేసుకునేది. ఈ పరిస్థితి విశాఖలోని మెడికల్ డివైజెస్ క్లస్టర్ కారణంగా మారింది. దేశంపై దిగుమతుల భారం తగ్గింది. ఎంఆర్ఐ యంత్రాలను దిగుమతి చేసుకోవడానికి రూ.4.5 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చేది. ఏపీ మెడ్‌టెక్ జోన్ లాంటివే మరో రెండు మెడ్‌టెక్ జోన్లను దేశంలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారంటే కేంద్రం మెడ్‌టెక్ జోన్లకు ఎంత ప్రాధాన్యం ఇస్తుందనేది తెలుస్తోంది. దీనిపై ప్రముఖ వ్యక్తులు వారి అభిప్రాయలను సోషల్ మీడియా ద్వారా వ్యక్త పరుస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: