కరోనా సమస్య ప్రంపంచాన్ని చుట్టేస్తూ ఉండటంతో ప్రపంచం ఈ వ్యాధి పై పోరాటం చేయడానికి భారతీయులు అనుసరించే నమస్కారం సుచీ శుభ్రతలను పాటిస్తూ భారతీయ సంస్కృతిని పరోక్షంగా అంగీకరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో బ్రిజిల్ అద్యక్షుడి నోటివెంట రామాయణ ప్రస్తావన రావడం మనదేశ సంస్కృతి గొప్పతనాన్ని సూచిస్తోంది.


భారతీయ సాహిత్యంలో రామాయణా నికి మించిన కావ్యంలేదు వేదకాలం తర్వాత త్రేతా యుగంలో సంస్కృతం భాషలో రచింప బడ్డ ఈ కావ్యాన్ని దేశంలోని అన్ని భాషలలోనే కాకుండా ప్రపంచంలోని అన్ని భాషలలోకి అనువదింప పడింది. ఇండోనేషిమా థాయిలాండ్ కంబోడియా వియత్నాం లావోస్ మలేషియా దేశాలలో కూడ రామాయణ గాథ ఇప్పటికీ ప్రచారంలో ఉంది.  


ప్రస్తుతం ప్రపంచం అంతా కోవిడ్-19 తో పోరాటం చేస్తున్న పరిస్థితులలో ఈ వ్యాధి చికిత్సకు ఉపయోగపడుతుంది అని భావిస్తున్న ‘హైడ్రాక్సీ క్లోరోక్విన్’ మన దేశంలో విపరీతంగా నిలవ ఉన్న పరిస్థితులలో ఆ డ్రగ్ ను అమెరికా తో పాటు తమకు కూడ ఇమ్మని బ్రిజిల్ దేశ అధ్యక్షుడు జెయిల్ బొల్సానారో మన ప్రధాని నరేంద్ర మోడీకి వ్రాసిన ఉత్తరంలో భారత ప్రభుత్వ సహాయాన్ని అర్ధిస్తూ మధ్యలో రామాయణ ప్రస్తావన తీసుకు రావడం అత్యంత సంచలనంగా మారింది. 


రాముడు సోదరుడు లక్ష్మణుడు ని రక్షించడం కోసం హిమాలయాల నుంచి హనుమంతుడు సంజీవని తెచ్చినట్లుగా తమకు మోడీ ‘హైడ్రాక్సీ క్లోరోక్విన్’ అందచేస్తే బ్రిజిల్ ప్రజల దృష్టిలో భారత ప్రభుత్వం ముఖ్యంగా మోడీ హనుమంతుడు తో సమానంగా గుర్తింపు పొందుతాడు అంటూ రామాయణ గాథ లోని ఘట్టాన్ని వివరించడం బట్టి ప్రపంచం అంతా భారతీయ సంస్కృతి వైపు ఎలా చూస్తుందో అర్ధం అవుతుంది. సంపన్న దేశంగా ప్రపంచాన్ని శాసించే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో పాటు అనేక దేశాధినేతలు మోడీ సహాయం కోసం ఎదురు చూస్తున్న సమయంలో కరోనా సమస్యలతో భారతావని నలిగిపోతున్నా మన సంస్కృతికి మన పురాణాలకు దక్కుతున్న గౌరవం చూసి ప్రతి భారతీయడి గర్వించవలసిన సమయం..  

మరింత సమాచారం తెలుసుకోండి: