ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వినాశనాన్ని సృష్టిస్తోంది. ఇక మన దేశంలో అత్యధిక కరోనా ప్రభావిత 10 రాష్ట్రాలలోని 8 రాష్ట్రాలలో కరోనా సోకిన వారి సంఖ్య నాలుగు రోజుల్లో రెట్టింపు అయింది. దేశంలో గంటగంటకూ కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే 5360 కి చేరుకున్న కరోనా కేసుల సంఖ్య తెల్లారేసరికి మారిపోతోంది. ఇండియాలో ప్రతి ప్రాంతంలో నమోదవుతున్న కేసుల్లో ఇప్పటి వరకు మర్కజ్‌ లింకులే ఎక్కువ. అయితే తాజాగా.. మర్కజ్‌బాధితుల నుంచి వారి కుటుంబ సభ్యులకు.. వాళ్లనుంచి బంధు మిత్రులకు కరోనా సోకినట్లు తెలుస్తోంది.. ఇలాంటి కేసులు మెల్లమెల్లగా ఆయా రాష్ట్రాల్లో బయట పడుతున్నాయి. 

 

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఎంత సీరియస్ గా చేస్తున్నా.. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణ, కేరళ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటకలలో అత్యధికంగా కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. దీనంతటికీ మర్కజ్‌బాధితులే కారణం అని ఆయా రాష్ట్రాలు గట్టిగా చెబుతున్నాయి. కేరళ, కర్ణాటక మినహా మిగిలిన 8 రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రభావం ఏప్రిల్ 1- 8 తేదీల మధ్య రెట్టింపు అయ్యింది. ఢిల్లీలో కేవలం రెండు రోజుల్లో సంక్రమణ రేటు రెట్టింపు అయింది. ఏప్రిల్ 2 న ఢిల్లీలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 223 గా ఉండగా, ఏప్రిల్ 4 నాటికి ఈ సంఖ్య 447 కు చేరింది. 

 

మున్ముందు అన్ని ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితే ఎదురయ్యే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కమ్యూనిటీ సర్వైలెన్స్‌, వ్యాధి నిర్ధారణ పరీక్షల సామర్థ్యం పెంపు, భవిష్యత్‌ అవసరాల మేరకు ఆస్పత్రులను సిద్ధం చేయడం వంటి చర్యలు తీసుకుంటోంది. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే ఇలాఉంటే.. ఇక దేశంలోని కరోనా హాట్ స్పాట్స్‌లో పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆందోళన నెలకొంది. ఇక . కేరళలో కరోనా నుండి కోలుకున్న రోగుల సంఖ్య 70 గా ఉంది. 

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple


 

 

మరింత సమాచారం తెలుసుకోండి: