ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు విధానం. దీనితో  అన్ని రంగాల పై తీవ్రం పరిణామం చోటు చేసుకుంది. ఇక వృత్తి వ్యాపార ఉద్యోగులతో పాటు.. మరోవైపు విద్య రంగం పై కూడా తీవ్ర ప్రభావం చూపింది అన్న మాటలో ఎటువంటి సందేహం లేదు..  కరెక్టుగా పరీక్షలు నిర్వహించే సమయంలో ఇలా కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో విద్యార్థుల పరిస్థితి అయోమయంగా మారింది. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితులను అనుసరించి హైదరాబాద్ లోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ విద్యార్థుల కోసం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 

 

ఇందుకు ముఖ్య కారణం విద్యార్థుల భవిష్యత్తు పై ఎటువంటి ప్రభావం చూపకూడదు అనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతుంది. అలాగే విద్యార్థులు ఉత్తీర్ణత పై కూడా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.. ఇక వివరాల్లోకి వెళితే ఈ సెమిస్టర్ కు డిస్టింక్షన్ విధానాన్ని తీసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అలాగే ఈ సంవత్సరంలో క్రెడిట్స్ తో సంబంధం లేకుండా తరవాతి సెమిస్టర్ లకు ప్రమోట్ చేయాలని యూనివర్సిటీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా దాదాపు రెండు లక్షల మంది విద్యార్థులకు మంచి జరుగుతుందని అంచనా వేస్తున్నారు.

 


ఇక లాక్ డౌన్ మొత్తం ముగిసాక జూన్ లో పరీక్షలు నిర్వహించేందుకు యూనివర్సిటీ అధికారులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అప్పటి వరకు విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు ద్వారా విద్య బొదన చేయాలని అన్ని కాలేజీలకు యూనివర్సిటీ ఆదేశం ప్రకటించింది. అలాగే గూగుల్ డ్రైవ్, ఈ - మెయిల్, అప్లికేషన్ల ద్వారా విద్యార్థులకు మెటీరియల్స్ అందచేయాలని తెలియజేసింది.

 


ఇక మరోవైపు జూన్ నెలలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభించాలని జేఎన్టీయూహెచ్ నిర్ణయం తీసుకున్నట్లు కూడా సమాచారం వినిపిస్తుంది.. ఇక ఇదే తరహాలో ఉస్మానియా యూనివర్సిటీ కూడా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: