దేశంలో కరోనా రోజు రోజుకీ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఓ వైపు లాక్ డౌన్ ఎంత సీరియస్ గా తీసుకుంటున్నా.. కొన్ని కేసులు మాత్రం పెరిగిపోతూనే ఉన్నాయి. ఏపిలో  ఈరోజు ఉదయం 9 నుంచి జరిగిన కోవిడ్19 పరీక్షల్లో కొత్త గా గుంటూరు లో 8, అనంతపూర్ లో 7, ప్రకాశం 3, పశ్చిమ గోదావరి లో ఒక్క కేసు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 19 కేసుల తో రాష్ట్రం లో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 348 కి పెరిగింది. తాజాగా నెల్లూరు జిల్లాలో ముగ్గురు పిల్లలకు కరోనా పాజిటివ్‌ అని తేలింది.

 

నిన్నటి పరీక్షల్లో బయట పడటంతో అధికారులు, వైద్యులు ఆందోళన చెందుతున్నారు. తడకు చెందిన వ్యక్తికి ఇప్పటికే ఐసోలేషన్‌లో చికిత్స జరుగుతోంది. అతని ఇద్దరు పిల్లలకు కరోనా పాజిటివ్ అని వైద్య పరీక్షల్లో వెల్లడైంది.   వాకాడులో పదేళ్ల బాలికకు కూడా కరోనా పాజిటివ్ అని నివేదికలో స్పష్టమైంది.  దాంతో ఏపిలో ఇప్పుడు పిల్లలకు కూడా కరోనా పాజిటీవ్ కేసులు మొదలయ్యాయన్న భయం పట్టుకుంది.  

 

దాంతో ఇకపై పిల్లలున్న ఇంటిలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు కరోనా చికిత్సపై వైద్యులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొన్నటి వరకు ఈ కరోనా వృద్దులకు చిన్న వయసు పిల్లలకు వస్తుందని చెబుతూనే ఉన్నారు.. నెల్లూరు లో మూడు కేసులు పాజిటీవ్ తేలగానా ఇప్పుడు మరింత జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. 

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: