ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్  కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రంగాల్లో మూతపడ్డాయి. ఈ క్రమంలోనే సినిమా షూటింగులు కూడా పూర్తిగా నిలిచి పోయిన విషయం తెలిసిందే . స్టార్ హీరోల సినిమాల నుంచి చిన్న హీరోల సినిమాల వరకు అన్ని  సినిమా షూటింగులు నిలిచిపోయాయి. అయితే ప్రస్తుతం కరోనా  ఎఫెక్ట్ కారణంగా భారత చిత్ర పరిశ్రమ భారీ కోట్ల నష్టాన్ని చవి చూస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం చిత్రీకరణ మధ్యలో ఆగిపోయి లేద... విడుదలకు సిద్దంగా ఉన్న సినిమాలకు  అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే విడుదలైన తర్వాత అయినా కలెక్షన్లు రాబడుతోంది అనే నమ్మకం ఉంటుంది. ఇప్పుడు సమస్యల్లా  కరోనా  ఎఫెక్ట్ ముందు విడుదలైన సినిమాలకు.. కరోనా ఎఫెక్ట్ తో లాక్ డౌన్ కారణంగా  థియేటర్లను మూసివేయాలని నిర్ణయించుకున్న తరుణంలో ఆల్రెడీ థియేటర్లు ప్రదర్శిస్తున్న సినిమాలకు చిక్కు వచ్చి పడింది. లాక్ డౌన్  కారణంగా సినిమా నష్టాల పాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

 

 

 ఇలాంటి సమయంలోనే డిజిటల్  ప్లాట్ ఫామ్ తో  సినిమాలకు ఎంత ఊరట లభించే ఉన్నట్లు తెలుస్తోంది. లాక్ డౌన్  కారణంగా సినిమా థియేటర్లన్నీ మూతపడి నష్టాలు చవి చూసినప్పటికీ డిజిటల్ స్ట్రీమింగ్ ద్వారా కొన్ని లాభాలు గడించేందుకు  సిద్ధమవుతునన్నాయి  చిన్న సినిమాలు. మరి కొన్ని సినిమాలు అయితే ఏకంగా డిజిటల్ లో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రజలు కూడా ఇంట్లో కూర్చుని కాలక్షేపం చేసేందుకు ఇష్టపడడం లేదు. ఏదో ఒక సినిమాలు చూడటానికి మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలోనే కొన్ని చిన్న సినిమాలకు డిజిటల్ స్ట్రీమింగ్ బాగా ఉపయోగపడింది అనే చెప్పాలి. ఇందులో ఒకటి ఓ పిట్ట కథ... ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ హీరోగా పరిచయమైన ఈ చిత్రం కోసం ఎంతో మంది ప్రముఖులతో ప్రమోషన్స్ చేశారు.. మార్చ్ 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు... థియేటర్లో బాగా ఆడుతుంది అనుకుంటున్న సమయంలోనే లాక్ డౌన్  ఎఫెక్టుతో థియేటర్లు మూత పడ్డాయి. కానీ విడుదలైన పదవ రోజున అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చేసింది ఈ సినిమా

 

 

 మరొకటి పలాస 1978 సినిమాకు కూడా డిజిటల్ స్ట్రీమింగ్  బాగా ఉపయోగపడింది . వర్గ భేదాల  గురించి శ్రీకాకుళం నేపథ్యంలో.. మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రాగా మంచి టాక్ తెచ్చుకుంది ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది . ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో నలుగురు హీరోయిన్లు కలిసి ఒక సినిమాను తెరకెక్కించిన సినిమా అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి. సినిమా విడుదల తర్వాత కూడా అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అన్నట్టుగానే మారింది పరిస్థితి. ప్రస్తుతం ఈ సినిమా కూడా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో. మధ అనే  సినిమా ఎన్నో అవార్డులు అభినందనలు గెలుచుకుంది. మార్చి 13 న విడుదలైన ఈ సినిమా ఎన్నో అవార్డులు  గెలిచినప్పటికీ థియేటర్లో  మాత్రం  ఎక్కువ రోజులు ఆడలేకపోయింది . దీంతో అమెజాన్ ప్రైమ్ లోకి అందుబాటులోకి వచ్చింది. డబ్బింగ్ సినిమాలకు  కూడా లాక్ డౌన్ ఎఫెక్ట్ కారణంగా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: