ప్రస్తుతం ప్రపంచం కరోనా వైరస్ తో ఎంత ఇబ్బంది పడుతుందో అందరికీ తెలిసిన విషయమే. దీంతో అనేక మంది ప్రాణాలు కోల్పోయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇలా అర్ధాంతరంగా జీవితాన్ని ముగిస్తారని ఎవరు అనుకోరు కదా... ఇలాంటి సమయాల్లో వారిపై ఆధారపడి జీవిస్తున్న వారి కుటుంబ సభ్యులు వారి జీవితాల గురించి ఆలోచిస్తేనే భయం వేస్తుంది. కనుక మనకి మన కుటుంబానికి లాంటి విపత్తులు జరిగినప్పుడు ఆసరా కోసం ఏదైనా ఇన్సూరెన్స్ తీసుకొని ఉంటే అవి కొంత వరకు మనకు ఉపయోగపడతాయి.

 

 


ఇక అసలు విషయానికి వస్తే... మన దేశంలో ఇన్సూరెన్స్ పాలసీలకు అనేక కంపెనీలు ఉన్నాయి. ఇందులో అందరికీ నమ్మకమైనది ఒకటి ఎల్ఐసి. అయితే lic కేవలం ఇన్సూరెన్స్ మాత్రమే కాదు, మనం కట్టిన ఎల్ఐసి పాలసీల మీద కూడా లోన్ సదుపాయాన్ని ఇస్తుంది. వీటిని మామూలుగా బ్యాంకులు లాగే ఈ EMI లను చెల్లిస్తే సరిపోతుంది. అయితే ఇటీవల 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన మారటోరియం ఆప్షన్ ఇది వారికి కూడా వర్తిస్తుంది.

 

 

ఇలా బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు లోన్ కు సంబంధించిన కంపెనీలకు మూడు నెలల EMI మారటోరియం ఆప్షన్ ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పిన సంగతి తెలిసిందే. దీనితో అనేక సంస్థలు వారి వారి కస్టమర్లకు EMI కట్టుకొనుటకు వెసులుబాటు కల్పించాయి. ఇందులో కేవలం బ్యాంకులు మాత్రమే కాకుండా ఎల్ఐసి ఇలాంటి ఇన్సూరెన్స్ కంపెనీల దగ్గర కూడా ఈ షరతులు వర్తిస్తాయి. అయితే ఇక ఎల్ఐసి ఇలాంటి కంపెనీలలో తీసుకున్న లోన్ ల సంగతి విషయానికి వస్తే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా రంగంలోకి వచ్చింది. దీనితో ఇన్సూరెన్స్ కంపెనీలు అన్నీ కూడా వారి వారి కస్టమర్లకు మారటోరియం ఆప్షన్ ఇవ్వాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లకు ఆదేశాలను జారీ చేసింది.


మామూలుగా ఎల్ఐసి పాలసీ హోల్డర్లకు రుణాలు తీసుకునేటప్పుడు రుణం ఎంత వస్తుంది అనేది సరెండర్ మొత్తం పైన ఆధారపడి ఉంటుంది. ఇక ఒక ఉదాహరణ తీసుకుంటే సరెండర్ మొత్తం పది లక్షలు అని అనుకుంటే పాలసీ హోల్డర్లకు 8 లక్షల నుంచి 9 లక్షల మధ్య లో పొందవచ్చు. ఇలా తీసుకున్న రుణాలను గడువు తేదీలలో చెల్లిస్తూ ఉంటారు పాలసీదారులు. కాకపోతే ప్రస్తుతం పాలసీ హోల్డర్లు కరోనా వైరస్ సంక్షోభం కారణంగా వాయిదాలు చెల్లించలేక పోతున్నారు. కాబట్టి ఇప్పుడు వారు ఈ మారటోరియం ఆప్షన్ ని ఎంచుకొని తరువాతి ఈ నెలలో ఈ కంతులను చెల్లించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: