దేశవ్యాప్తంగా ప్రస్తుతం లాక్ డౌన్ గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొందరు లాక్ డౌన్ పొడిగించాలని కోరుతుంటే.... మరికొందరు ఇప్పటికే ఆకలితో అలమటిస్తున్నామని లాక్ డౌన్ ను ఎత్తివేయాలని కోరుతున్నారు. లాక్ డౌన్ ను కొనసాగిస్తారా...? ఎత్తివేస్తారా...? అనే ప్రశ్నకు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ ను కొనసాగించాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 
కేంద్రం లాక్ డౌన్ ను ఏప్రిల్ 30 వరకు పొడిగించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మరోవైపు దేశంలో చోటు చేసుకుంటున్న కొన్ని ఘటనలు కూడా లాక్ డౌన్ ను ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తారని వస్తున్న ఊహాగానాలకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టు లాక్ డౌన్ ను ఏప్రిల్ 30 వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. 
 
ఈరోజు ఒడిశా సీఎం రాష్ట్రంలో ఏప్రిల్ 30వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటన చేశారు. ఏపీలో లాక్ డౌన్ ను ఎత్తివేస్తారని ఊహాగానాలు వినిపించినా ఏపీలో లాక్ డౌన్ కొనసాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏపీలో మొదట ఆర్టీసీ రిజర్వేషన్లకు అనుమతి ఇచ్చినా మరలా బుకింగ్ ఆపివేసినట్లు పేర్కొంది. రైల్వే శాఖ ఏప్రిల్ 30 వరకు రైళ్లను బంద్ చేస్తున్నట్లు ప్రకటన చేసింది. 
 
ఏప్రిల్ 30 వరకు విమానాలు కూడా రాకపోకలు సాగించే అవకాశాలు లేవని ప్రచారం జరుగుతోంది. దేశంలో పలు రాష్ట్రాలు, రైల్వే శాఖ తీసుకుంటున్న నిర్ణయాలను పరిశీలిస్తే లాక్ డౌన్ పొడిగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్ డౌన్ ను పొడిగించాలని మోదీని కోరారు. మోదీ మరో రెండు మూడు రోజుల్లో లాక్ డౌన్ పొడిగింపు గురించి ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది.                 

మరింత సమాచారం తెలుసుకోండి: