కరోనా వైరస్‌ జంతువులకూ సోకుతుందా.. దునియా మొత్తం ఇప్పుడిదే పెద్ద డౌట్‌.. ఎందుకంటే.. న్యూయార్క్‌లో ఓ పెద్ద పులికి కరోనా వచ్చిందంట.. అప్పటి నుంచి ప్రపంచంలోని అన్ని జూలను.. అనేక రసాయనాలతో పిచికారీ చేస్తున్నారు. ఈ దెబ్బకు.. హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్‌  పార్కు సిబ్బంది కూడా అలర్ట్‌ అయ్యారు. మరోవైపు.. రెండ్రోజులుగా కుక్కలు కూడా వింత రోగాలతో చనిపోతున్నాయి. ఒకే ప్రాంతంలో 12 కుక్కలు ఒకే రోజు ఏదో వ్యాధితో చనిపోయాయంట.. ఇప్పుడు ఇదో కొత్త టెన్షన్‌..కుక్కలకు కరోనా సోకిందా అని ఆ ఊళ్లో ఒకటే రచ్చ..

 

ఇప్పటి వరకు మనుషులనే ఊచకోత కోస్తున్న కరోనా.. ఇప్పుడు జంతువులపైనా పడిందా.. పులులు.. పిల్లులు.. కుక్కలను కూడా వదలదా...?

 

అమెరికాలోని న్యూ యార్క్‌లో ఓ పెద్ద పులికి కరోనా వచ్చిందని కబురందగానే.. ప్రపంచంలోని అన్ని రకాల జంతుప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. పులికే కరోనా సోకిందంటే..ఇక.. ఆ వైరస్‌కు కుక్కా, నక్కా, పిల్లి పెద్ద లెక్కా చెప్పండి అనంటున్నారు కరోనా పేషెంట్స్‌..

 

కరోనా వైరస్‌ నుంచి మనుషులనే కాపాడలేక పోతున్న పెద్ద పెద్ద డాక్టర్లు.. జంతువులను ఎంత వరకు పట్టించుకుంటారో ఏమో.. ఏదైతేనేం మొత్తానికి.. మన హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్‌ పార్కులో కూడా సిబ్బంది అలర్ట్‌ అయ్యారు. అనేక రసాయనాలతో పిచికారీ చేస్తున్నారు. యానిమల్‌ కీపర్లు మాస్కులు, గ్లౌజులతో పాటు చేతులను శుభ్రం చేసుకునేందుకు శానిటైజర్లను వాడుతూ సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. జంతువుల మధ్య కూడా సోషల్‌ డిస్టన్స్‌ పెంచుతున్నారు. జూపార్కులోని దాదాపు 150 మంది సిబ్బందికి జూ సర్వీస్‌ గేట్‌ వద్ద థర్మల్‌ స్కానింగ్‌ జరుపుతున్నారు. అంతేకాకుండా ఎన్‌క్లోజర్‌ల వద్ద ఫుట్‌బాత్‌ నిర్వహిస్తున్నారు.

 

మరోవైపు తెలంగాణలోని మంథని, పెద్దపల్లి ప్రాంతాల్లో వీధి కుక్కలు సైతం వింత వ్యాధులతో చనిపోతున్నాయి.. రెండ్రోజుల్లో 12 కుక్కలు మృత్యువాత పడ్డాయి. ఇదే ఇప్పుడు స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది.

 

పులికి కరోనా వ్యాధి వచ్చిందంటున్న తరుణంలోనే.. కుక్కలు చనిపోవడం చూస్తుంటే.. ఈ కుక్కలకు కరోనా వైరస్‌ వ్యాపించిందేమోననే టెన్షన్‌తో బిక్కుబిక్కుమంటున్నారు. అయితే వైద్యులు మాత్రం..పోస్టుమార్టం చేసి ఏ కారణం చేత చనిపోయాయో చెబుతామంటున్నారు. ఇదీ పరిస్థితి..కరోనా టెన్షన్‌ ప్రతి ఒక్కరికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఏమైతేనేం..మీరు మాత్రం ఇంటి నుంచి బయటకు రాకండి..మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: