మందులేని మహమ్మారి కరోనా వైరస్... కంటికి కనిపించకుండా కాటువేసి కాటికి పంపిస్తోంది... ప్రస్తుతం ప్రపంచాన్ని చిగురుటాకులా వణికిస్తోంది . ప్రపంచ దేశాల్లో శర వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది. ఎంతోమందిని మృత్యువుతో పోరాడేలా  చేస్తున్నది . ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు మరణ మృదంగం వాయిస్తూ విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారిని జయించాలంటే నివారణ ఒక్కటే మార్గం. సామాజిక దూరం వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే ఈ మహమ్మరి దరిచేరకుండా ఉంటుంది. భారత దేశంలో శరవేగంగా వ్యాప్తిచెందిన ఈ మహమ్మారి వ్యాధి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా విజృంభిస్తున్న  విషయం తెలిసిందే. 

 

 

 ఈ నేపథ్యంలో కరోనా  వైరస్ సోకిన వారితో పాటు కరోనా  వైరస్ అనుమానితులను కూడా అసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నాయి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు. అయితే కరోనా  వైరస్ ను  ఎదుర్కోవాలంటే రోగ నిరోధక శక్తి ఎక్కువ అవసరం. అందుకే ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం రోగనిరోధక శక్తిని పెంచేందుకు కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే క్వారంటైన్  సెంటర్  ఆస్పత్రిలో ఉన్న అందరికీ ఎంతో బలవర్ధకమైన పోషకాహారం అందిస్తోంది. క్వారంటైన్  లో ఉన్న పేషెంట్లు అందరికీ నిపుణుల సూచనల మేరకు స్పెషల్ మెనూ భోజనం అందజేస్తున్నారు. భోజనంలో నారింజ పండ్లు. అరటి పండ్లు, బాదం పిస్తా, జీడిపప్పు, ఖర్జూర అందిస్తున్నారు. వీటితోపాటు ఉడకబెట్టిన గుడ్డు కూడా మెనూలో పేషెంట్లకు అందిస్తున్నారు. ఈ ఆహారం ఎంతో  పౌష్టిక మైనది... క్రమం తప్పకుండా ఇలాంటి ఆహారం తీసుకుంటే రోగనిరోధకశక్తి ఎంతగానో మెరుగుపడుతుంది.

 

 

 తద్వారా వైరస్తో పోరాడేందుకు శక్తి వస్తుంది. వైరస్ తో పోరాడి తొందరగా కోలుకునేందుకు ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ఆస్పత్రిలో ఇలాంటి ఆహారమే అందజేస్తున్నారు. అయితే కేవలం కరోనా  వైరస్ పేషెంట్లకు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులు లారీ డ్రైవర్లు ఇళ్లు లేని పేదలకోసం ప్రభుత్వం రిలీఫ్  సెంటర్లను ఏర్పాటు చేసింది. ఈ రిలీఫ్  సెంటర్లలో కూడా జగనన్న గోరుముద్ద అనే పథకం లో భాగంగా మెనూ లో ఉన్న ఆహారాలను పాటించాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: