ప్రస్తుతం దేశం మొత్తం కరోనా వైరస్ సృష్టిస్తున్న అరాచకం అంతా ఇంతా కాదు.  ప్రపంచంలో ఇప్పటి వరకు కరోనాతో వెల సంఖ్యల్లో మరణాలు సంబవిస్తున్నాయి.  లక్షల సంఖ్యల్లో ఈ కరోనా మరణాలు పెరిగిపోతున్నాయి.  చైనాలో పుట్టుకొచ్చిన ఈ భయంకరమైన వైరస్ ప్రపంచ దేశాలకు నిద్ర పట్టకుండా చేస్తుంది. దేశంలో కరోనా ని అరికట్టేందుకు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకుండా కట్టుదిట్టం చేస్తున్నారు పోలీసులు.

 

ఇదిలా ఉంటే ఇప్పుడు జనాలపై ప్రకృతి కూడా కోపం తో ఉన్నట్టుంది.. నెల్లూరులో అకాల వర్షం రావడంతో పిడుగు పాటుతో ఐదుగురు మృతి చెందారు.  దగదర్తి మండలం చెన్నూరులో పిడుగుపడి ముగ్గురు గొర్రెల కాపరులు మృతి చెందారు. అంతే కాదు పిడుగు పాటుతో పెంచల రెడ్డి, సుబ్బారావు అనే వ్యక్తులు పిడుగు పాటుతో మరణించారు.  

 

ఉన్నట్టుండి ఉరుములు.. మెరుపులతో బీభత్సంగా వర్షం పడటంతో పంటలు కూడా నష్టపోయాయి. ఓ వైపు కరోనాతో రైతులు నానా అవస్థలు పడుతుంటే మరోవైపు ప్రకృతి కోపంతో మరిన్ని కష్టాల్లో పడ్డారు రైతన్నలు.  ఈ పరిస్థితుల్లో పొలాల్లో, కల్లాల్లో ఉన్న పంట తడిసిపోయింది. వైరస్‌కు వర్షాలు తోడై నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: