శృంగారం అనేది ప్ర‌తి మ‌నిషి జీవితంలో ఉండేదే. కాక‌పోతే అది స‌రైన ప‌ద్ధ‌తిలో చేస్తే ఇద్ద‌రూ సుఖ‌ప‌డ‌తారు. లేదంటే ఏ ఒక్క‌రికి ఏది న‌చ్చ‌క‌పోయినా ఇక అందులో ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంది. ఇక శృంగారం చేసేట‌ప్పుడు పార్ట్‌న‌ర్‌తో సున్నితంగా ప్ర‌వ‌ర్తించాలి. త‌ప్పించి మోటుగా ఉండ‌కూడదు. ఇక ఈ విష‌యం పై ర‌క ర‌కాల అధ్య‌య‌నాలు చేసిన ప‌రిశోధ‌కులు చాలా మందే ఉన్నారు. ఇక శృంగారం చేసేట‌ప్పుడు స్త్రీతో ఎలా ప్ర‌వ‌ర్తించాలి ఏంటి అనే అంశం గురించి ఈ రోజు తెలుసుకుందాం...

 

శృంగారం చేసేట‌ప్పుడు మంచి మూడ్ లో ఉన్నప్పుడు.. మత్తుగా మాట్లాడుకోవాలి.. కానీ, ఆ సమయంలో కొంత మంది అస‌భ్య‌క‌ర‌మైన మాట‌లు వాడ‌తారు అవి చాలా మంది ఆడ‌వారు ఇష్ట‌ప‌డరు. అలాంటివి మాట్లాడ‌టం వ‌ల్ల వారి మూడ్ మారిపోయే అవ‌కాశం ఎంతైనా ఉంది. అలాగే ప‌రిశోధ‌ర‌కులు చెప్పే దాని ప్ర‌కారం శృంగార సమయంలో కొన్ని విష‌యాలు అస్స‌లు ప్రస్తావించ‌కూడదు. వాటిల్లో మొదటిగా పూర్వ శృంగార సంబంధాల ప్రస్తావన. గ‌తంలో ఇలా చేశారా. ఇలాంటి అనుభ‌వాలు ఉన్నాయా లాంటి విష‌యాల గురించి మాట్లాడ‌కూడ‌దు.  అలాగే మీ పాత జ్ఞాప‌కాల‌ను కూడా వారికి చెప్ప‌డం కూడా అంత మంచిది కాదు.  ఆమె కు వేరే పార్టనర్ తో సంబంధాలున్నాయా.. అనే అంశం గురించి ఆరాతీసే ప్రయత్నం కూడా అలాంటి స‌మ‌యాల్లో చేయ‌కూడ‌దు అంటున్నారు శాస్త్రవేత్త‌లు.  ఈ రెండూ ప్రమాదకరమే.. దాంతో స్త్రీ మూడ్ పూర్తిగా మారిపోతుంది. ఇక వారు శృంగారానికి స‌హ‌క‌రించ‌రు.

 

అలాగే మ‌రో అంశం ఏమిటంటే... పోర్నోగ్రఫీ అని వీళ్లు వివరించారు. పోర్నో గ్రఫీ పూర్తిగా కల్పితం. అలాంటి ప్రయోగాలను చేయడం కూడా చాలా మంది ఆడ‌వారు ఇష్ట‌ప‌డ‌రు. అలాగే అందులో చూసి కొంత మంది మ‌గ‌వారు అలా చేయాల‌నుకుంటారు. కాని అది కూడా స‌రైన ప‌ద్ధ‌తి కాదు అంటున్నారు ప‌రిశోధ‌కులు. అలాగే  ఆమెకు కష్టం అనిపించే భంగిమల జోలికి అస్స‌లు  వెళ్లకపోవ‌డం చాలా మంచిది.  లేడీ పార్టనర్ వద్దంటే.. వద్దు.. అంతటితో వదిలేయడం మంచిది లేద‌ని దాన్ని ఫోర్స్ చేసి ఎలాగైనా ఆ భంగిమ చేయాల‌నుకుంటే  ఇంకెప్పుడూ వారు శృంగారంలో క‌ల‌వ‌డానికి పెద్ద‌గా ఆశ‌క్తి చూప‌రు.  

 

అలాగే శృంగారం చేసేట‌ప్పుడు ఇష్టంతో ప్రేమ‌గా చేయాలి. అంతేకాక పార్ట‌న‌ర్‌ని ఎప్పుడూ కూడా ఇంక చాలా అని అడ‌గ‌కూడ‌దు. ఇక శృంగారాన్ని ముగించాలి అనుకున్న‌ప్పుడు ఈ ప్రశ్న పొరపాటున కూడా అడగొద్దని... ఈ మాట అపార్థానికి దారి తీయవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొంత మంది ఈ మాట‌ని నెగిటివ్‌గా తీసుకునే అవ‌కాశాలు చాలానే ఉన్నాయి అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: