ఆ మద్య స్పైడర్ 3 మాన్ మూవీ చూశారా.. అందులో ఓ నల్లని పదార్థం హీరోని చుట్టేస్తూ అతన్ని విలన్ గా మార్చేస్తుంది.  ఆ తర్వాత అది విలన్ కి దొరికి తర్వాత అతని లో పవర్ పవర్ పెరుగుతుంది.. మొత్తాని  ఆ నల్లని వింత పదార్థం చూస్తుంటే వెగటంగా కనిపిస్తుంది.  తాజాగా అలాంటిదే రియల్ గా చూస్తే.. అసలు అది ఏం జీవి అన్న విషయం అర్థం కాక జుట్టు పీక్కునే పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది.  తాజాగా  నల్లగా.. శరీరమంతా వానపాములు పాకుతున్నట్టుగా ఉన్న ఆ జీవి ఏంటో ఎవరికీ అంతుచిక్కడం లేదు.

 

అమీబా ఆకారంలో.. ఓ రాయి మీద పాకుతున్న దాని వీడియోను ఎవరో తమ సెల్ ఫోన్‌లో బంధించి గత వారం సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఓ వైపు కరోనాతో నానా ఇబ్బందులు పడుతుంటే ఈ టైప్ వింత వింతులు చూస్తుంటే జడుసుకుంటున్నారు. మరికొందరైతే వెనోమ్ 2 ఫిలింకు పబ్లిసిటీ తీసుకొచ్చేందుకు సోనీ పిక్చర్స్ సంస్థనే మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగా ఇలా చేస్తుందోమోనని సందేహం వ్యక్తం చేస్తున్నారు.

 

కాలిఫోర్నియా బెరింగ్‌ రెషియో(సీబీఆర్‌) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బూట్‌లేస్ సరీసృపంగా పిలుస్తారు. ప్రపంచంలోనే ఇది అత్యంత పొడవైన జీవి అని.. దాదాపు 180మీ. పొడవు ఉంటుందని తెలిపారు. వీటి శరీరం జెల్లీలా కదులుతుందని తెలిపారు. ఇప్పటివరకు ఈ వీడియోకు 19.5మిలియన్ల వ్యూస్ రావడం విశేషం.  ఇది తన శరీరం ద్వారా విషపూరిత ద్రవాన్ని విడుదల చేస్తుందని తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: