కరోనా కల్లోల కాలంలో క‌ష్టాలు ఎదురుకాని రంగాలు ఏవీ అని ఎదురుచూడాల్సిన ప‌రిస్థితి ఇప్పుడు. క‌రోనా క‌ష్టాల‌తో మొద‌ట వెసులుబాటు పొంది వ‌ర్క్ ఫ్రం హోం అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఇప్పుడు ఇబ్బందుల్లో ప‌డిపోయారు. ప్రస్తుత ప్రాజెక్టు పూర్తయిందని, ఇక కొత్త ప్రాజెక్టు లేదని టర్మినేషన్ లెటరను ఉద్యోగుల‌కు మెయిల్ చేస్తున్నారు. వారి ఉద్యోగాల‌ను ఊద‌గొడుతున్నారు. ఈ వారం రోజుల్లోనే దాదాపు 1,000 మందిని ఉద్యోగం నుంచి తొలగించినట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

 

హైదరాబాద్ కేంద్రంగా దాదాపు 1,500 సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఐదున్నర లక్షల మందికిపైగా పని చేస్తున్నారు. మ‌న ఐటీ ప‌రిశ్ర‌మ‌కు మెజార్టీ ఆదాయ వ‌న‌రు, క్ల‌యింట్లు క‌లిగి ఉన్న దేశం అమెరికానే. అయితే, అగ్ర‌రాజ్యం అమెరికాలో కరోనా విజృంభణ నేపథ్యంలో అక్కడి నుంచి కొత్తగా ఎలాంటి ప్రాజెక్టులు రావడం లేదు. భవిష్యత్ లో ప్రాజెక్టులు వస్తాయో లేదో తెలియని అయోమయ పరిస్థితి. దీంతో మన దేశం నుంచి యూఎస్‌కు సాఫ్ట్‌వేర్ సర్వీసులు అందించే కంపెనీలు సంకటంలో పడ్డాయి. కొత్త ప్రాజెక్టులు వచ్చే వరకు ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం తలకు మించిన భారంగా చాలా సంస్థలు భావిస్తున్నాయి. దీంతో ఎంప్లాయిస్ ను వదిలించుకునే పనిలో పడ్డాయి. ప్రస్తుంతం కొనసాగుతున్న ప్రాజెక్టుకు కావాల్సిన టెక్కీలను ఉంచుకుని మిగతా వారిని ఇంటికి పంపిస్తున్నాయి. ఇలా అర్ధ‌రాత్రి అప‌రాత్రి అనే తేడా లేకుండా ఉద్యోగాలు ఊడ‌గొట్టే ప‌నిలో ఉన్నాయి. ఈ మెయిల్స్ పెడుతూ మీ ఉద్యోగం పోయింద‌ని స‌మాచారం ఇస్తున్నాయి. 

 


మార్చ్ నెల జీతం అందిన మరుసటి రోజు కంపెనీల నుంచి చాలా మందికి ఉద్యోగాలు తొల‌గిస్తున్నామ‌నే ఈ మెయిల్స్ వెళ్లాయని స‌మాచారం‘‘కొత్త ప్రాజెక్టులు లేవు. ఇక నుంచి మీరు మా కంపెనీ ఉద్యోగస్తులు కాదు. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత ఆఫీసుకు వచ్చి సెటిల్ చేసుకోండి’ అని పేర్కొంటూ మెయిల్స్ పంపిన‌ట్లు స‌మాచారం. ప్రస్తుత ప్రాజెక్టు పూర్తయిందని, ఇక కొత్త ప్రాజెక్టు లేదని టర్మినేషన్ లెటరను ఎంప్లాయిస్ కు మెయిల్ చేస్తుండ‌టంతో హ‌ఠాత్తుగా ఉద్యోగం పోవ‌డంతో ఏం చేయాలో తెలియని అయోమయంలో టెక్కీలు పడ్డారు. క‌రోనా త‌మ‌కు ఇలా క‌ష్టాలు తెచ్చి పెడుతుంద‌ని అనుకోలేద‌ని వాపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: