కరోనా మహమ్మరిపై పోరాటం చేయడంలో భారతదేశ ప్రధాని మోదీ ముందున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని మొత్తం ఏకం చేసి నడిపిస్తున్నారు. కరోనా వ్యాప్తి పెరగకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. రాజకీయాలు జోలికి పోకుండా ప్రతిపక్షాలని సైతం కలుపుకుని ముందుకెళుతున్నారు. అలాగే కరోనాని మరింతగా కట్టడి చేసేందుకు లాక్ డౌన్ మరిన్ని రోజులు పెంచడానికి సిద్ధమయ్యారు. ఇక అటు ప్రజలు కూడా ప్రధాని మాట తూచా తప్పకుండా పాటిస్తున్నారు.

 

అయితే కరోనాపై యుద్ధం చేసే విషయంలో మోదీ ఇతర దేశాలకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాగే కరోనా కట్టడికి ఉపయోగపడే  హైడ్రాక్సీ క్లోరోక్వీన్ మెడిసిన్ పొరుగు దేశాలకు పంపిణీ చేసి పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. అమెరికాతో పాటు పలు కరోనా ప్రభావం ఉన్న దేశాలకు  భారత ప్రభుత్వం తాజాగా హైడ్రాక్సీ క్లోరోక్వీన్ మెడిసిన్ ఎగుమతి చేసింది. ఇక దీనికి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నుంచి ప్రశంసలు కూడా వచ్చాయి.

 

భారత్ సాయాన్ని ఎప్పటికీ మరచిపోమని, నరేంద్ర మోదీ బలమైన నాయకత్వం కరోనా పోరులో.. కేవలం భారత్‌కే కాదు, మొత్తం మానవాళికి అండగా నిలబడుతోందని ట్రంప్ పొగడ్తల వర్షం కురిపించారు. ఇక మిగతా దేశాలు కూడా మోదీకి కృతజ్ఞతలు చెప్పాయి. అయితే మోదీ పెద్ద దేశాలనే కాదు. పేదరికంలో ఉన్న చిన్నదేశాలకు పెద్దన్నగా నిలుస్తున్నారు.

 

తాజాగా  ఆయన ఉగాండా దేశాధ్యక్షుడు యోవెరి ముసెవినితో ఫోన్‌లో కరోనా వ్యాప్తి, సహాయకచర్యలపై మాట్లాడారు. ఉగాండాలో కరోనా నివారణ చర్యల కోసం భారత్ అన్నివిధాలుగా సాయపడుతుందని భరోసా ఇచ్చారు. అలాగే బాగా వెనుకపడి ఉన్న ఆ దేశానికి ఆర్ధికపరంగా కూడా సాయం చేసేందుకు మోదీ సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ విధంగా మోదీ పెద్ద దేశాలనే కాకుండా చిన్న దేశాలని సైతం పట్టించుకుంటూ, ఈ విపత్కర సమయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏదేమైనా ఈ కరోనాపై యుద్ధం చేయడంలో మోదీ పెద్దన్న పాత్రే పోషిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: