ఒకవైపు కరోనా వైరస్ వల్ల మనుషులు చనిపోతుంటే మరోపక్క వైకాపా టిడిపి రాజకీయాలు శృతిమించి పోతున్నాయి. ఇటువంటి కీలకమైన సమయంలో బాధ్యతాయుతంగా ప్రజలను నడిపించాల్సిన రాజకీయ నేతలు సమస్యను పక్కదారి పట్టించి  క్రెడిట్ కోసం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. తాజాగా ఇటీవల కరోనా వైరస్ నియంత్రణ సమీక్ష సమావేశం జరిపిన సందర్భంలో సీఎం జగన్ రాపిడ్ టెస్టింగ్ కిట్లను ఓపెన్ చేశారు. దాదాపు వెయ్యి కిట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో వైసీపీ నేతలంతా ఈ విషయాన్ని చాలా గొప్పగా చెప్పుకోవడం స్టార్ట్ చేశారు. మరోపక్క ఆ కిట్లు రావటానికి కారణం చంద్రబాబు అంటూ టీడీపీ కూడా ఈ విషయంలో తల దూర్చింది.  దీంతో ఇప్పుడు విశాఖ మెడ్‌టెక్ జోన్ కేంద్రంగా ఇప్పుడు ఏపీ రాజకీయం నడుస్తుంది. విశాఖ మెడ్‌టెక్ జోన్ 2014 ఎన్నికల్లో చంద్రబాబు గెలిచిన తర్వాత ప్రధాని మోడీ హయాంలో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా విశాఖ మెడ్‌టెక్ జోన్ ని చంద్రబాబు స్థాపించారని టిడిపి నేతలు ప్రస్తుతం వ్యాఖ్యలు చేస్తున్నారు.

 

అంతేకాకుండా చంద్రబాబు ముందుచూపు ఉండటం వల్లే రాష్ట్రంలో విశాఖ మెడ్‌టెక్ జోన్ కేంద్రంగా టెస్టింగ్ కిట్లు ప్రజలను ఆదుకుంటూ ఉన్నాయని.. చంద్రబాబు రాష్ట్రంలో లేకపోయినా ఆయన ఆలోచనలు ప్రజలను బ్రతికి స్తున్నాయి అంటూ మీడియా ముందు తెగ ఊదరగొడుతున్నారు టిడిపి నేతలు. మరోపక్క ఇదే తరుణంలో అధికార పార్టీ వైసీపీ నేతలు విశాఖ మెడ్‌టెక్ జోన్ ని కేంద్రంగా చేసుకొని చంద్రబాబు కొన్ని వేల కోట్ల కుంభకోణాలకు తెగబడ్డారు అంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు.

 

దీంతో ఈ రాజకీయ విషయం మొత్తం ఎలక్ట్రానిక్ మీడియాలో సోషల్ మీడియాలో పైలెట్ కావటంతో నెటిజన్లు ప్రజలు మనుషుల ప్రాణాలు కోల్పోతున్న సమయంలో అసలు విషయం వదిలేసి క్రెడిట్ కోసం వైకాపా - టీడీపీ ఎందుకీ రాజకీయ ఆటలు అంటూ విమర్శలు చేస్తున్నారు. ప్రపంచమంతా రాజకీయాలను శత్రుత్వాలు పక్కనపెట్టి కరోనా వైరస్ తో పోరాడుతూ ఉంటే మీరు మాత్రం ఇంకా ఈ టైంలో ఒకరితో ఒకరు పోరాడటం క్రెడిట్ కోసం ఆరాటం అవసరమా ఈ టైంలో అంటూ మండిపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: