ప్రస్తుతం భారతదేశం మొత్తం ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. దేశం మొత్తం మోదీ నాయకత్వంలో కరోనా వైరస్ పై పోరాటం లో ముందుకు అడుగులేస్తోంది. ఈ క్రమంలోనే దేశ ప్రధాని నరేంద్రమోదీ సూచించిన విధంగా ప్రజలందరూ పాటిస్తున్నారు. గతంలో జనతా కర్ఫ్యూ విధిస్తూ ప్రజలందరూ ఇంటికే పరిమితం కావాలని... సాయంత్ర సమయంలో చప్పట్లు కొట్టాలి  అని పిలుపు ఇవ్వగా పాటించారు. ఇక మొన్నటికి మొన్న రాత్రి సమయంలో దేశ వ్యాప్తంగా ప్రజలందరూ లైట్లు ఆర్పేసి దీపాలు వెలిగించాలి అంటూ ప్రధాని నరేంద్ర మోడీ సూచించగా భారత ప్రజలు అందరూ దీనిని కూడా అనుసరించారు. 

 


 ఇలా భారత ప్రధాని ఇచ్చిన సూచనలను సలహాలను పాటిస్తూ కరోనా వైరస్ పై పోరాటం లో ముందుకు సాగుతుంది భారత ప్రజానీకం. ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ప్రధాని నరేంద్ర మోడీ కి సంబంధించి ఒక వార్త హల్చల్ చేస్తోంది. కరోనా ను  తరిమికొట్టేందుకు అలుపెరగని పోరాటం చేస్తున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ కి గౌరవం ఇచ్చేందుకు ప్రతి ఒక్కరూ సాయంత్రం ఐదు గంటల సమయంలో ఐదు నిమిషాల పాటు నిలబడి మోదీకి గౌరవం ఇవ్వాలి అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇక ఈ విషయం ఏకంగా ప్రధాని నరేంద్రమోదీ వరకు వెళ్ళింది. 


 అయితే దీనిపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలందరికీ మరో పిలుపునిచ్చారు. ఐదు నిమిషాల పాటు నిలబడి తనను గౌరవించాల్సిన అవసరం లేదని.. తనను గౌరవించాలి అనుకుంటే ప్రతి ఒక్కరు ఒక పేద కుటుంబానికి సహాయం చేయాలి అంటూ పిలుపునిచ్చారు నరేంద్ర మోడీ. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు... చాలా మంది పేద ప్రజలకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. నిత్యావసరాలను అందించడం సహా ఆహారాన్ని కూడా అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన సూచనలు పై విశ్లేకులు  ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఒక అద్భుతమైన సూచనను దేశ ప్రజానీకానికి ఇచ్చారు అంటూ ప్రశంసిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: