చంద్రబాబు జగన్ కి చుక్కెదురు. ఒకరు తూర్పు అయితే మరొకరు పడమర. ఇద్దరి రాజకీయాలూ వ్యక్తిగత కక్షల్లా ఉంటాయి. కనీసం రాజకీయాలు పక్కన పెట్టి ఇద్దరు నేతలూ మామూలుగా మాట్లాడుకున్న సందర్భం ఇంతవరకూ ఎవరూ చూడలేదు. ఒకనాడు తమిళనాడులో ఈ తరహా రాజకీయాలు సాగాయి. అక్కడ దిగ్గజ నేతలు జయలలిత, కరునానిధి ఈ రకంగా ముఖా ముఖాలు చూసుకోకుండా సవాళ్ళు చేసుకుంటూ గడిపారు.

 

మరి ఏపీ విషయంలో కూడా ఇదే రకమైన రాజకీయం చోటు చేసుకుంటోంది. జగన్ ఏమి అన్నా బాబు వెంటనే అడ్డు పుల్ల వేస్తారు. అది కరోనా వైరస్ సమయాన మరోటా అన్నది అవసరం లేదు. తాను వ్యతికించల్సిందేనన్నది ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ గట్టి పట్టుదల, అదే లక్ష్యంగా  ఉంటోంది.

 

 

ఇక ఒకనాడు జగన్ హైదరాబాద్ లో ఉంటే బాబు అమరావతిలో సీఎం గా  ఉండేవారు. నాడు బాబు ఆయన మంత్రులు జగన్ని తెగ విమర్శించేవారు. పొరుగు రాష్ట్రంలో కూర్చుని ఊసుపోని కబుర్లు చెప్పడం కాదు, ఇక్కడ మేము కష్టపడుతున్నామని సెటైర్లు వేసేవారు. ఇక చినబాబు లోకేష్ అయితే మరి కాస్తా ముందుకువెళ్ళి  వారంతా అవతల గట్టున కూర్చుని ఉన్నారని ఎకసెక్కమాడేవారు.

 

మరిపుడు చూస్తే అచ్చం బాబు కూడా అదే చేస్తున్నారు. బాబు హైదరాబాద్ లో ఉంటున్నారు. ఆయన అక్కడ నుంచి లేఖలు రాస్తున్నారు. రాజకీయ విమర్శలు చేస్తున్నారు. కరోనా మీద జగన్ సర్కార్ ఏమీ చేయడంలేదని కూడా అంటున్నారు. దాంతో మండుకొచ్చిన వైసీపీ నేతలు కూడా పొరుగు  రాష్ట్రంలో కూర్చుని విమర్శలు చేయడమేంటి బాబూ అంటూ గాలి తీసేస్తున్నారు.

 

బాధ్యత లేకుండా బాబు కరోనా పెను విపత్తు  సమయంలో వేరే రాష్ట్రంలో ఉన్నారని కూడా అంటున్నారు. నిజంగా ఇది టిట్ ఫర్ టాట్ లాగానే ఉంది. లేకపోతే బాబు ఏమిటి, జగన్ని నాడు అని తాను ఈనాడు అవే మాటలు పడడం ఏంటి. మొత్తం మీద చూసుకుంటే బాబు జగన్ స్టిక్కర్ తగిలించేసుకున్నారు. మరెన్ని వన్నె చిన్నెలు ఈ నాలుగేళ్ళలో చూడబోతామో.

మరింత సమాచారం తెలుసుకోండి: