ఎప్పుడైనా.. ఎక్కడైనా నిజం కంటే అబద్దమే ఎక్కువగా వేగంగా వ్యాపిస్తుంది.. అది ఎంత వేగంగా అంటే కరోనా వైరస్ కంటే కూడా వేగంగా వ్యాపిస్తుంది.. సోషల్ మీడియాలో ఒక మెసెజ్ వచ్చింది అంటే.. అది టైం పాస్ కి చేసిన సరే వాట్సాప్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా వెబ్ సైట్లలో ఈ న్యూస్ అత్యంత వేగంగా వ్యాపిస్తుంది. 

 

ఇంకా వాట్సాప్ లో అయితే చెప్పకూడదు.. ఒకే మెసేజ్ వేరు వేరు కాంటాక్ట్స్ నుండి పది సార్లకుపైగా మనకు షేర్ అవుతుంటుంది. ఇంకా అలానే ఈ మధ్యకాలంలో ఓ మెసెజ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అది ఏంటి అంటే? వాట్సాప్ లో ఏదైనా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే ఆ తర్వాత వచ్చే టిక్స్ ద్వారా ప్రభుత్వం వాటిపై చర్యలు తీసుకుంటోంది అని ఆ మెసేజ్ లో సారాంశం.. 

 

ఇంకా ఈ మెసెజ్ పై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ట్వీటర్ ద్వారా ఖండించింది. ప్రభుత్వ ప్రణాళికలు, విధానాల గురించి సమాచారం అందించే ప్రభుత్వ సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. వాట్సాప్ టిక్ మార్కులపై సోషల్ మిడిల్ స్ప్రెడ్ అవుతున్న మెసెజ్ ని ఫేక్ మెసెజ్ అని తెలిపింది. ఆ మెసెజ్ లో ఉన్నట్టు ప్రభుత్వం ఏటువంటి చర్యలు తీసుకోవడం లేదని ట్వీటర్ లో పేర్కొంది.

 

ఆ మెసెజ్ లో ఒక మహిళ మూడు బ్లూ టిక్స్ గురించి వివరిస్తూ ఓ ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేసింది. అది చూస్తే నిజమైన న్యూస్ కూడా ఎవరు షేర్ చెయ్యరు.. అలా ఉంది ఆ వీడియో మెసేజ్. ఇంకా ఆ వీడియో మెసేజ్ లో ఏముంది అంటే? 

 

మూడు బ్లూ టిక్స్ - ప్రభుత్వం ఈ మెసేజ్ ని గుర్తించింది.

 

రెండు బ్లూ టిక్స్, ఒక రెడ్ టిక్ - ప్రభుత్వం మెసేజ్ పంపిన వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 

 

ఒక బ్లూ టిక్, రెండు రెడ్ టిక్స్ - ప్రభుత్వం మెసేజ్ పంపిన వారి డేటాను పరిశీలిస్తుంది.

 

మూడు రెడ్ టిక్స్ - ప్రభుత్వం మెసేజ్ పంపిన వారిపై చర్యలు తీసుకుంది. వారు త్వరలో కోర్టు సమన్లు అందుకుంటారు.

 

అంటూ ఆ ఫేక్ మెసేజ్ లో ఆమె గంబీరమైన గొంతుతో ఫేక్ న్యూస్ వీడియోను తీసి సోషల్ మీడియాలో వదిలింది.. దీంతో ప్రజలంతా హడలిపోయి.. అది నిజం ఏమో అని నమ్మి విచ్చలవిడిగా షేర్స్ చేసేస్తున్నారు. దీంతో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆ మెసేజ్ లో ఎంతమాత్రం నిజం లేదని ట్విట్ చేసి కొట్టిపారేసింది. అందుకే ఇకపై అలాంటి వీడియోలు మీకు వస్తే షేర్ చెయ్యకుండా జాగ్రత్తపడండి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: