భారత్ లో కరోనా రోజు రోజుకి  విజృంభిస్తుంది. నిన్న ఒక్క రోజే దేశ వ్యాప్తంగా 700కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా నిన్నటివరకు మొత్తం 1,44,910 శాంపిల్స్ టెస్టులు జరుగగా అందులో 6,653 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఇందులో 602 మంది కోలుకోగా 211 మంది మరణించారు. ఇప్పటివరకు మహారాష్ట్రలో అధికంగా కరోనా కేసులు అలాగే మరణాలు సంభవించాయి. ఆ రాష్ట్రంలో 1346 కేసులు నమోదుకాగా 81 మంది చనిపోయారు. ప్రస్తుతం మహారాష్ట్ర తో పాటు తమిళనాడు, ఢిల్లీ , గుజరాత్ లలో కరోనా ప్రభావం అధికంగా వుంది. తమిళనాడులో అయితే నిన్న ఒక్క రోజే 96 కరోనా పాజిటివ్ కేసులు నమోదుపై కావడం తో మొత్తం కేసుల సంఖ్య 800 దాటింది. మహారాష్ట్ర తరువాత అత్యధిక కరోనా కేసులు నమోదు చేసిన రెండో రాష్ట్రం గా తమిళనాడు రికార్డు సృష్టించింది.
 
 
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే నిన్న చాలా వరకు రెండు రాష్ట్రాల్లో కేసులు తగ్గు ముఖం పట్టాయి. తెలంగాణ లో నిన్న కొత్తగా 18 పాజిటివ్ కేసులు నమోదు కావడం తో మొత్తం కేసుల సంఖ్య 471కు చేరింది. అలాగే ఆంధ్రా లో నిన్న15 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 363 కు చేరింది. తెలంగాణ లో ఈ రోజు నుండి పెద్దగా పాజిటివ్ కేసులు నమోదు కావని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఇక ఒడిశా లో ఈనెల 30 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి  నవీన్ పట్నాయక్ వెల్లడించారు. దాంతో  దేశం లో లాక్ డౌన్ ను పొడిగించిన మొదటి రాష్ట్రంగా ఒడిషా నిలిచింది.   

మరింత సమాచారం తెలుసుకోండి: