కరోనా  మహమ్మారి దేశంలో విలయ తాండవం చేస్తున్న వేళ దేశ ప్రజలంతా  భయాందోళనలలో ఉన్నారు. అని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి.  దీని ఎల్లలకు  ఏ దేశం కూడా మినహాయింపు కాదు.  జైళ్లలో ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం కారాగారంలో ఉంటున్న నిందితులకు తమ సొంత పూచీకత్తు తో తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదే అదనుగా ముంబైలోని తలోజా  కారాగారం లో ఉంటున్న నిందితుడు కరోనా కారణం చూపి బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. కానీ  బాంబే హైకోర్టు  నిందితుడి పిటిషన్ తిరస్కరించింది.

 

 వివరాలలోకి వెళ్తే  ముంబైలోని తలోజా   కారాగారంలో నిందితుడు హత్య కేసులో 19 నెలలుగా ముంబై కారాగారంలో ఉంటున్నాడు. కరోనాని  కారణం చూపి బెయిల్ మంజూరు కోసం పిటిషన్ దాఖలు చేయగా దానిని బాంబే హైకోర్టు తిరస్కరించింది. కరోనా కారణంగా వచ్చే ముప్పు జైలో కంటే బయట ఎక్కువ అని అదేవిధంగా బెయిలు కంటే జైలు ఉత్తమమని హితవు పలికింది 

మరింత సమాచారం తెలుసుకోండి: