హైదరాబాద్‌లో నాలుగు రోజులుగా కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా న‌మోదవుతున్న నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం కీలక చర్యలకు ఉపక్రమించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్ప‌టి వ‌ర‌కు మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారిని 593 మందిని గుర్తించామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్ కుమార్  తెలిపారు. కరోనా కేసులు రోజురోజుకూ పదుల సంఖ్యలో వెలుగు చూస్తుండటంతో ప్రభుత్వం కరీంనగర్‌ మోడల్‌ను రాష్ట్రవ్యాప్తంగా అనుసరించేందుకు సిద్ధమైంది. కరోనా కేసులు అధికంగా ఉన్న 130 ప్రాంతాలను హాట్‌స్పాట్లుగా గుర్తించింది. వెంట‌నే ఈ ప్రాంతాలను స్వాధీనం చేసుకునేందుకు పోలీసు శాఖ స‌న్నాహాకాలు మొద‌లుపెట్టింది. 

 

కరీంనగర్‌లో ఇదే ఫార్ములాతో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడంలో పోలీసులు, ఆరోగ్య శాఖ విజయవంతమయ్యాయి. కానీ మర్కజ్‌ యాత్రికుల వల్ల రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతూ పోతుండటంతో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా హాట్‌స్పాట్లను ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. హాట్‌స్పాట్లుగా గుర్తించిన సదరు కాలనీ, డివిజన్‌ లేదా ఊరు మొత్తాన్ని పోలీసులు పూర్తిగా త‌మ అదుపులోకి తీసుకుంటారు.  సదరు ప్రాంతానికి దాదాపు కిలోమీటరు ప్రాంతం వ‌ర‌కు కూడా ఎవ‌రిని రానివ్వ‌రు. ఆ ప్రాంతం మొత్తం హోం క్వారంటైన్‌ అయినట్లే. ఈ ప్రాంతాల్లో  ప్ర‌తీ ఒక్క‌రికి కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ప్రాంత వాసులంతా అత్యవసరమైతే తప్ప బయటకు రానివ్వ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటారు.


14 రోజుల పాటు ఆయా ప్రాంతాల్లో  పోలీసులు క‌ఠిన నిర్బంధాన్ని అమ‌లు చేస్తారు. ఈ 14 రోజుల్లో ఏ రోజు పాజిటివ్‌ కేసులు వెలుగుచూసినా మరో 14 రోజులు దిగ్బంధనం పెంచుతారు.  అయితే ఈ విధానంలో చివరి రోజు ఒక్క కేసు వెలుగుచూసినా.. మరో రెండు వారాలు ఆ ప్రాంత వాసులు ఇంటికే పరిమితం కావాల్సి ఉంటుంద‌ని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు.  ఆయా ప్రాంతాల్లో \ప్రజలందరికీ నెగెటివ్‌ వచ్చే వరకు పోలీసుల ప‌హారా నిర్బంధం కొన‌సాగుతుంది. ఇదిలా ఉండ‌గా ఆయా ప్రాంతాలను పోలీసులు, రెవెన్యూ సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నిత్యావసర దుకాణాలను కూడా మూసేసే యోచనలో ఉన్నారు. సరకులను ఇంటికే సరఫరా చేసే ఏర్పాట్లు చేయనున్నారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: