దేశంలో ఇప్పుడు లాక్ డౌన్ కొనసాగుతుంది.. ఎక్కడ చూసినా నిర్మానుశ్యం.. అందరూ ఇంటి పట్టున ఉంటూ కరోనా నిర్మూలనకు తమ వంతు సహాయం చేయాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి. అయితే కరోనా ఒక్కరికి వచ్చినా.. దాని వల్ల ఎంతోమందికి ప్రమాదం ఉంటుంది.  ఈ లక్షణాలు ఉన్నవారు వెంటనే క్వారంటైన్ లో ఉండాలని.. వైద్యులను సంప్రదించి గతు చికిత్స తీసుకోవాలని వైద్యులు, రాష్ట్ర ప్రభుత్వం చెబుతూనే ఉంది.  కానీ కొంత మంది మోహమాటం.. ఇతరులకు తెలిస్తే ఇబ్బంది అని సొంత ప్రయోగాలు చేయడం.. రహస్యంగా స్థానిక వైద్యుల వద్ద చికిత్స తీసుకోవడం జరుగుతుంది. 

 

తాజాగా ఇలా చేసి ముగ్గురు తమ ప్రాణాల మీదికి తెచ్చుకున్నారు.  తూర్పుగోదావరి జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది.  వివరాల్లోకి వెళితే..  విశాఖపట్టణం జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలంలోని కత్తిపూడికి ఓ వ్యక్తి వచ్చాడు.  తనలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో అప్రమత్తమైన అతడు స్థానికంగా ఓ ఆర్‌ఎంపీ వద్దకు వెళ్లి చికిత్స తీసుకున్నాడు.  గోప్యంగా దాచి చికిత్స వైద్యం తీసుకున్నారు..ఈ  విషయం తెలిసిన అన్నవరం పోలీసులు, విషయం తెలిసినా బయటపెట్టనందుకు బాధితుడి మామ, అతడికి చికిత్స చేసిన ఆర్‌ఎంపీ, రక్త పరీక్షలు చేసిన ల్యాబ్ టెక్నీషియన్‌పై కేసులు నమోదు చేశారు.

 

మరోవైపు, బాధితుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో విశాఖకు తరలించారు. ఎన్ని సార్లు ఇలాంటి విషయాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేసినా.. సోషల్ మాద్యమాల్లో చెప్పినా.. కొంత మంది చేస్తున్న పనులు వల్ల కరోనాని అరికట్టే పరిస్థితి లేకుండా పోతుంది. 

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: