క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచ‌వ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి 209 దేశాల‌కు వ్యాపించి ప్ర‌జ‌ల‌ను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఈ క్ర‌మంలోనే గంట గంటకూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్ప‌టికే క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16 ల‌క్ష‌లు దాట‌గా.. మృతుల సంఖ్య 90 వేల‌కు చేరువ అయింది. ఇక ముఖ్యంగా ఇక యూరోప్ లో అయితే కరోనా మరణ మృదంగం వాయిస్తోంది. దీంతో శాస్త్రవేత్తలు ఈ వైరస్ కు అడ్డుకట్ట వేసేందుకు విరుగుడును కనిపెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

 
మ‌రోవైపు క‌రోనా దెబ్బ‌తో కోట్లాది మంది జీవనోపాధిని సైతం మహమ్మారి చిన్నాభిన్నం చేసింది. అన్ని రంగాలూ స్తంభించిపోవడంతో ఆర్ధిక వ్యవస్థలు కుప్పకూలతున్నాయి. ఇదిలా ఉంటే.. అమెరికాలో కరోనా ర‌క్క‌సి కారణంగా నిరుద్యోగుల సంఖ్య తీవ్ర స్థాయిలో పెరుగుతోంది. గురువారం విడుదల చేసిన అధికారిక లెక్క‌ల‌ ప్రకారం.. తాము ఉపాధిని కోల్పోయామని క్లయిమ్ చేసిన వారి సంఖ్య 1.70 కోట్లను దాటింది.ఇలా ఉద్యోగాలు కోల్పోయి నిరుద్యోగులుగా మారుతున్నందుకే నిరుద్యోగ భృతి కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటున్నారు. గత వారం ఏకంగా 66 లక్షలమంది దరఖాస్తు చేసుకున్నారు. 

 

కాగా, అమెరికాలో ఇప్ప‌టికే చాలా సంస్థలు మూతపడ్డాయి. 48 రాష్ట్రాలు ప్రాధాన్యం కాని వ్యాపారాలను మూసివేశాయి. ఈ నేపథ్యంలో 3 వారాల వ్యవధిలోనే ప్రతి 10 మందిలో ఒకరు ఉద్యోగం కోల్పోగా.. నిరుద్యోగం అమాంతం పెరిగింది. ఈ క్రమంలో నిరుద్యోగ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకుంటోన్న వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా గత మూడు వారాల్లో నిరుద్యోగ భృతిని కోరుతూ దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 1.66కోట్లకు చేరింది. 1948 నుంచి చూస్తే.. ఇదే అతి పెద్ద ఉద్యోగాల నష్టంగా పరిగణిస్తున్నారు. ఇక మ‌రో బాధాక‌ర విష‌యం ఏంటంటే.. ఈ నెలలో మ‌రో రెండు కోట్ల మందికి పైగా అమెరికన్లు ఉద్యోగాలు పోగొట్టుకునే అవకాశాముంద‌ని అంటున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: