కరోనా కరోనా ఇప్పుడు ఎక్కడ విన్నా ఈ పేరు వినిపిస్తుంది.  కరోనా ప్రపంచాన్ని వణికిస్తుంది.. చిన్నా పెద్ద.. పేద, ధనిక అనే తేడాలు లేకుండా ఈ కరోనా ప్రభావంతో అల్లకల్లోల అవుతుంది.  తాాజాగా కరోనా వైరస్‌తో పోరాడుతున్న ఓ మహిళ పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. తమిళనాడులోని తంజావూరులో జరిగిందీ ఘటన. గత కొన్ని రోజులుగా ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారికి ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా చూపిస్తుందన్న విషయం తెలిసిందే.  స్థానిక సుందరంనగర్‌కు చెందిన 55 ఏళ్ల వ్యక్తి ఇటీవల ఢిల్లీలో జరిగిన సదస్సుకు వెళ్లొచ్చాడు.

 

అధికారులు కుటుంబ సభ్యులను క్వారంటైన్ చేశారు. వారికి నిర్వహించిన పరీక్షల్లో అతడితోపాటు నిండు గర్భిణి అయిన అతడి భార్యకు కూడా కరోనా వైరస్  సోకినట్టు నిర్ధారణ అయింది. ఆమెకు పురిటి నొప్పులు రావడంతో తంజూవూరులోని రాసామిరాసుదార్‌ ఆస్పత్రిలో చేర్పించి సిజేరియన్ ద్వారా బిడ్డను బయటకు తీశారు. అనంతరం తల్లీబిడ్డలను వేర్వేరు వార్డులకు తరలించి పర్యవేక్షిస్తున్నారు. బిడ్డను కన్న ఆనందంలో ఆ తల్లిలేదు.. వెంటనే ఇద్దరనీ వేరు చేయడం పై కన్నీరు పెట్టుకుంది.  అయితే శిశువుకు కరోనా సోకిందీ, లేనిదీ రిపోర్టుల్లో తేలుతుందని, వాటి కోసం వేచి చూస్తున్నట్టు చెప్పారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: