కరోనా రక్కసి కోరలకు చిక్కుకు పోయి యావత్ భారతావని విలవిలా లాడుతూ ఉంది. మర్కజ్ నిజాముద్దీన్ ప్రార్థనల అనంతరం కరోనా వ్యాప్తి నానాటికి పెరిగి పోతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలను పట్టి పీడిస్తోంది . నిన్నటి వరకు ఏపీలో 363  కేసులు నమోదుకాగా ఆరుగురు చనిపోయారు. గడచినా 24  గంటలలో 890  మందికి కరోనా పరీక్షలు జరపగా అందులో 17  కరోనా కేసులు నమోదు కావడం జరిగింది . కొత్తగా వచ్చిన మొత్తం రెండు కేసులతో కలిపి 19  కేసులు గడచిన 24 గంటలలో నమోదు జరిగాయి . 

 

అదేవిధంగా మొన్న గుంటూరు జిల్లా నర్సారావు పేటలో ఓ కేబుల్ ఆపరేటర్ కరొనతో చనిపోగా అతను సర్వీస్ చేసిన ప్రాంతాలన్నింటినీ రెడ్ జోన్ లు గా ప్రకటించారు ఏపీ ప్రభుత్వం . ఏపీ లో ఇప్పటి వరకు 143  హాట్ స్పాట్లను గుర్తించడం జరిగింది . దీనితో ఏపీ లో సెక్యూరిటీని కట్టుదిట్టం చేసారు   

మరింత సమాచారం తెలుసుకోండి: