ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం అతాలకుతలం అవుతోంది. ఒకవైపు దేశవ్యాప్తంగా లాక్ డౌన్.. మరోవైపు నిత్య అవసర సరుకులకు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే నిత్యావసర సరుకుల కోసం ఎవరైనా బయటికి వెళితే పోలీస్ శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అనవసరంగా ఇళ్లలో నుంచి బయటికి వస్తే కేసులు నమోదు చేయడానికి రెడీగా ఉన్నారు. దీనితో ప్రజలకు పనులు తగ్గిపోవడం కూడా జరుగుతుంది. ఈ తరుణంలో కొంతమంది మోసగాళ్లు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు.

 

 

పూర్తి వివరాల్లోకి వస్తే... ప్రస్తుతం ప్రజలందరూ ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటూ ఉంటే కేటుగాళ్లు మాత్రం ఈ సమస్యలను వాళ్లకి అనుగుణంగా మార్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందుకు వాళ్ళు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇందుకు నిదర్శనమే ప్రస్తుతం ఎక్కడ చూసినా గూగుల్ పే నుంచి ఒక లింక్ వైరల్ అవుతుంది. వాస్తవానికి ఇది గూగుల్ పే కంపెనీ రిలీజ్ చేయలేదు. సైబర్ కేటుగాళ్లు ఈ లింకును వైరల్ చేస్తున్నారు. ఆ లింకు ఓపెన్ చేయగానే స్క్రాచ్ చేస్తూ మీకు డబ్బులు వస్తాయని తెలిపారు. ఇలా స్క్రాచ్ చేయడం ద్వారా 1000 నుంచి 10 వేల వరకు డబ్బులు వస్తాయి. అంతేకాకుండా గూగుల్ పే డబ్బులతో పాటు మీ ఇంటికి కావలసిన నిత్యవసర సరుకులు కూడా పంపిస్తాము అంటూ మోసగాళ్లు వైరల్ చేస్తున్నారు.

 

 

ఇక ఈ వివరాలు ఇలా ఉండటంతో చాలామంది ఆర్థిక కష్టాలు కాస్త మెరుగుపడతాయని ఆ లింకును వాడడం జరుగుతుంది. ఇలా చేయడంతో వారి ఖాతాలలో ఉండే డబ్బులు భారీగా ఆ కేటుగాళ్లు దోచుకుంటున్నారు. వెయ్యి రూపాయల కోసం చూసుకొని లక్షలు కూడా పోగొట్టుకున్న వారు ఉన్నారు మరి కొద్ది మంది బాధితులు. నిజానికి ఆ లింకును క్లిక్ చేస్తే ఫోన్లో ఉన్న బ్యాంకింగ్ సమాచారాలు అన్ని వాళ్లకు చేరుకుంటాయి. కాబట్టి అపరిచిత మెసేజ్ లు అన్నిటినీ కూడా ఓపెన్ చేయడం కానీ.. లింకులు క్లిక్ చేయటం కానీ చేయకుండా ఉండడం చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: