కరోనా... కరోనా... కరోనా... ప్రస్తుతం ప్రపంచంలో ఏ మూలన చూసిన ఈ పదం తప్పించి ఇంకో పదం అంటూ లేకుండా అయిపోయింది. ఇప్పటికే ప్రపంచం మొత్తానికి 15 లక్షలకు దగ్గరగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే ఈ వైరస్ దెబ్బకి 90 వేలకు దగ్గరలో మరణాలు సంభవించాయి. అలాగే అనేక దేశాల్లో ఈ వైరస్ మూలంగా లాక్ డౌన్ ప్రకటించాయి. ఇంకా కొన్ని దేశాల్లో అనేక ఆంక్షలు విధిస్తున్నారు. అయితే వీటి వల్ల ఎంతో ప్రయోజనం ఉన్నా అక్కడక్కడ మాత్రం అపశృతులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.

 


ముఖ్యంగా మన దేశంలో లాక్ డౌన్ కారణంతో చాలా పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలు ఎన్నో వాయిదా పడ్డాయి. కొందరేమో వాటిని వాయిదా వేసుకోలేక వారి కుటుంబ సమక్షంలోనే పని కానిచ్చేస్తున్నారు. అయితే ఇక అసలు విషయానికి వస్తే... మామూలుగా వివాహబంధాన్ని వందేళ్లు గుర్తుంచుకునేలా ఒక సంబరంగా నిర్వహించుకుంటారు ప్రతి ఒక్కరు. అయితే ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా అనకాపల్లి లోని గవరపాలెంలో గురువారం నాడు పెళ్లి జరిగింది. కాకపోతే ఆయన సొంతూరులో అంగరంగ వైభవంగా పెళ్ళి చేసుకోవాలనుకున్న చివరికి భార్య కళ్యాణ మండపం కూడా బుక్ చేసుకున్న చివరికి వారి ఇంటి వద్దనే కేవలం ఏడుగురు బంధువుల సమక్షంలో వారి వివాహాన్ని పూర్తి చేసుకున్నారు.

 

 


ఇక లాక్ డౌన్ కారణంగా వీరి ఆశలు పూర్తిగా ఆవిరయ్యాయి. వీరి వివాహాన్ని వాయిదా వేసేందుకు ఇరువురి కుటుంబ సభ్యులు ఇష్టపడకపోవడంతో ఈ పెళ్లి తంతును చాలా నిరాడంబరంగా జరుపుకున్నారు. ఈ వివాహ వేడుకకు కేవలం వధూవరుల తల్లిదండ్రులతో పాటు పంతులు మరో ఓ ముఖ్యమైన కేవలం ఏడు మంది మాత్రమే హాజరయ్యారు. ఏది ఏమైనా ఇలాంటి పరిస్థితులను అర్థం చేసుకొని ఎవరికీ ఇబ్బంది కలగకుండా పెళ్లి చేసుకున్నందుకు ఆ నూతన జంటని అభినందించక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: