ప్రపంచ దేశాల్లో పెద్దన్నగా చెప్పుకునే అమెరికా ఇప్పుడు ఒక చిన్న కరోనా వైరస్ తో అల్లకల్లోలం అవుతుంది. గత కొన్ని రోజులుగా కరోనా చేతికి చిక్కి విలవిల్లాడుతున్నాడు. వందలు కాదు... వేలు కాదు... సుమారు 5 లక్షల మంది అమెరికన్లు కరోనా బారిన పడ్డారు. ఇంత వరకూ 17 వేల మంది వరకూ చనిపోయారు.  అక్కడ కరోనా సోకిన వాళ్లలో కోలుకున్నది కేవలం పాతి వేల మందే. 4 లక్షల 20 వేల మందికి పైగా ఇంకా చికిత్స పొందుతున్నారు.  న్యూయార్క్‌లో నోవెల్ క‌రోనా వైర‌స్ వ‌ల్ల మృతిచెందిన వారిని హ‌ర్ట్ ఐలాండ్‌లో ఖ‌న‌నం చేస్తున్నారు.

 

 మృతిచెందిన వారికి బంధువులు లేకున్నా, లేక శ‌వాల‌ను ఖ‌న‌నం చేసే స్తోమ‌త లేకున్నా.. అలాంటి మృత‌దేహాల‌ను సాధార‌ణంగా హ‌ర్ట్ ఐలాండ్‌కు త‌ర‌లిస్తుంటారు. తూర్పు బ్రాంక్స్ స‌మీపంలో ఈ చిన్న దీవి ఉన్న‌ది. 1800 సంవ‌త్స‌రం నుంచి ఈ దీవిని ఖ‌న‌నాల కోస‌మే వాడుతున్నారు. గత వారం రోజుల నుంచి కరోనాతో మరణించిన వారి ఆచూకి కోసం ఎవరూ రాకుంటే వారి మృతదేహాలు హాస్ప‌ట‌ల్లో ఉంచినట్లు న్యూయార్క్ మేయ‌ర్ ప్రెస్ సెక్ర‌ట‌రీ ఫ్రెడ్డీ గోల్డ్‌స్టీన్ తెలిపారు.

 

 ఒక‌వేళ మార్చ‌రీ అధికారుల‌తో ఎవ‌రైనా త‌మ బంధువుల స‌మాచారాన్ని చేర‌వేస్తే, అలాంటి మృతదేహాల‌ను దాచిపెడుతున్నామ‌ని ఆ అధికారి తెలిపారు.  ఇక ఎలాంటి ఆచూకి ఏని అనాథ శవాలను  తామే హ‌ర్ట్ ఐలాండ్‌లో ఖ‌న‌నం చేస్తున్న‌ట్లు చెప్పారు.  అయితే దారుణమైన విషయం ఏంటంటే.. మృత‌దేహాల‌ను మోసుకువెళ్లి ఖ‌న‌నం చేసేందుకు ప‌నివారు దొర‌క‌డం లేదు. దీంతో కొన్ని జైళ్ల నుంచి ఖైదీల‌ను ఇలాంటి ప‌నుల‌కు వాడుకుంటున్నారు.  వారికి స్వ‌ల్పంగా కొంత అమౌంట్ ఇస్తున్నారు.  ప్రతిరోజు సుమారు 25 మృతదేహాలను ఖననం చేస్తున్నట్లు సమాచారం. 

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: