క‌రోనా మ‌హ‌మ్మారి జంతువులకూ సోకుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల జూ అధికారులు అప్రమత్తమయ్యారు. జూలలో ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని సెంట్రల్ జూ అథారిటీ అత్యవసర సర్కులర్ జారీ చేసింది. దాంతో వన్యప్రాణులకు వైరస్‌ సోకకుండా కట్టుదిట్టమైన ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

 

జంతువులకూ కరోనా సోకుతుండడంతో తెలంగాణ అటవీశాఖ అప్రమత్తమైంది.. అమ్రాబాద్‌, కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో.. దాదాపు 4 వేల సీసీ  కెమెరాల సాయంతో ... పులులు, ఇతర వన్యప్రాణుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.

 

హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌ కూడా అప్రమత్తమైంది. జూపార్క్‌లో జంతువులకు ఆహారం అందించే  ఉద్యోగులు ఇతర సిబ్బందికి.. తరచుగా  వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని... ఆరోగ్యవంతమైన సిబ్బందితోనే ...వాటి పర్యవేక్షణ చేయడం జరుగుతోందంటున్నారు అధికారులు.

 

వరంగల్ జూ అధికారులు వన్యప్రాణులకు వైరస్‌ సోకకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి జంతువుపై అనుక్షణం నిఘా వేస్తూ, వాటి ఆరోగ్య ప‌రిస్థితిని ప‌ర్య‌వేక్షిస్తున్నారు. జూ ప‌రిస‌రాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు శుభ్రం చేస్తున్నారు. అంతే కాదు జంతువుల్లో రోగ నిరోధక శక్తి పెంచేలా చర్యలు చేపట్టారు. Or ద్రావణాలను అందిస్తూనే ప్రత్యక మైన మందులను అందుబాటు లో ఉంచారు.

 

ఆసియాలోనే అతి పెద్దదైన శ్రీవేంకటేశ్వర జూ లోనూ కరోనా నియంత్రణపై అప్రమత్తమయ్యారు.క్యూరేటర్‌ బబిత ఆధ్వర్యంలో జూ లో రసాయనాలు పిచికారీ చేశారు. ప్రతి వన్యప్రాణి ఎన్‌క్లోజర్‌ను శుభ్రం చేస్తున్నారు. శాఖాహార జంతువుల ఆహార పదార్థాలను, ఉప్పువేసిన వేడినీటిలో శుభ్రపరిచి ఇస్తున్నారు. మాంసాహార జంతువులకు ఉడకబెట్టిన మాంసాన్ని అందిస్తున్నారు. 

 

కరోనా సోకిన యజమానుల వల్లే  మూగజీవాలకు కరోనా వ్యాపిస్తోందని అధికారులు చెబుతున్నారు. జంతువుల వల్ల మరో జంతువుకి లేదా మనిషికి సోకుతుందనేందుకు ఆధారాలు లేవంటున్నారు వెటర్నరీ డాక్టర్లు.

 

రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి జూ లో జంతువులపై అనుక్షణం నిఘా వేస్తున్నారు. వాటి ఆరోగ్య ప‌రిస్థితిని ప‌ర్యవేక్షిస్తున్నారు. జూ ప‌రిస‌రాల‌ను ఎప్పటిక‌ప్పుడు శుభ్రం చేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: