దేశంలో ప్రస్తుతం లాక్ డౌన్ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. దీనితో లాక్ డౌన్ ప్రకటించక ముందే ఇంటికి చేరుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే వారు మళ్ళీ తిరిగి వెళ్లడానికి లాక్ డౌన్ ముగిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు వారి ఆర్టీసీ బస్సులను నడపడానికి సిద్ధమయ్యాయి. దీనికోసమని అనేక ఆర్టీసీ సంస్థలు టికెట్లను బుక్ చేయడం ప్రారంభించాయి. అయితే ఇప్పుడు పరిస్థితి చూస్తే బస్సులు నడిచేలా లేవని అర్థమవుతోంది. అయితే ఇప్పుడు ఏపీ ప్రజలకు ఆర్టీసీ ఒక బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఇప్పుడు కొత్తగా రిజర్వేషన్లను నిలిపివేస్తూ నిర్ణయాన్ని తీసుకుంది. మామూలుగా ఏప్రిల్ 15 నుంచి సర్వీసులను మొదలు పెట్టాలని ప్రభుత్వం ఆలోచించింది. దీనికోసం అని రిజర్వేషన్లను ఓపెన్ చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసి టికెట్లను బుక్ చేయడం జరిగింది.

 


అయితే ఇప్పుడు లాక్ డౌన్ పొడిగించే అవకాశం ఉండడంతో ప్రభావం రోజురోజుకీ పెరగడంతో మరల పునరాలోచనలో పడింది. మొదటగా ఏప్రిల్ 5 నుంచి రిజర్వేషన్లను ఏపీఎస్ఆర్టీసీ మొదలు పెట్టింది. దీనితో అనేక మంది బెంగళూరు హైదరాబాద్ చెన్నై ఇలా పలు నగరాలకు వెళ్లాల్సిన వారు భారీగా టిక్కెట్లను బుక్ చేసుకున్నారు. ఇందులో అధిక శాతం ఐటీ ఉద్యోగులు అని చెప్పవచ్చు. ఇప్పుడు బుకింగ్స్ ని గురువారం నిలిపివేసింది నిన్నటి వరకు వివిధ మార్గాల్లో అన్ని కలిపి నలబై ఐదు వేలు టికెట్లను బుక్ చేసుకుంది. అయితే ఇప్పుడు పరిస్థితి మాత్రం లాక్ డౌన్ ని పొడిగించడం ఖాయంగా తెలుస్తోంది.

 


దీనికి కారణం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలలో కేసులు అధికంగా ఉండడమే. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఐటి ఉద్యోగులు ఎవరైతే హైదరాబాదులో పనిచేస్తున్నారో ఎలాగైనా హైదరాబాద్ కు చేరుకున్నాం అనేవారికి ఇది నిజంగా బ్యాడ్ న్యూసే. అయితే ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు తిరగడం తిరగకపోవడం అనే విషయంపై ఏప్రిల్ 13వ తేదీన స్పష్టత చేస్తామని ఆర్టిసి చెప్పుక వచ్చింది. అయితే ఒకవేళ లాక్ డౌన్ ని పొడిగిస్తే వారు బుక్ చేసుకున్న టికెట్ ని క్యాన్సిల్ చేసి దానికి సంబంధించి పూర్తి రిఫండ్ అందిస్తామని ఆర్టీసీ యాజమాన్యం తెలుపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: