ఆయన ఏమి అల్లాటప్ప వ్యక్తి కాదు. వాతావరణాన్ని కూడా కంట్రోల్ చేయగల వ్యక్తి. సునామీని కూడా ఒంటిచేత్తో ఆపగల సమర్ధుడు. ఇవన్నీ ఎవరో చెప్పినవి కాదు. ఆయనకు ఆయనే తరచూ చెప్పుకునే మాటలు. ఆయన మరెవరో కాదు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు. ఆయన చూడని విపత్తులు, ఎత్తు,పల్లాలు లేవు. ఆపదలను కూడా తనకు అనుకూలంగా మార్చుకోగల అపర మేధావి అయిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏపీ ఎదుర్కొంటున్న పెను విపత్తు కరోనా విషయంలో మాత్రం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. కరోనా విషయంలో తన సలహాలు అడగండి అంటూ పదేపదే మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి చెబుతున్న చంద్రబాబు, ప్రభుత్వానికి ప్రజలకు సలహాలు ఇవ్వకుండా పాత ధోరణిలోనే ఈ విపత్తు ను కూడా తన రాజకీయ విమర్శలకు వేదికగా చేసుకోవడం చంద్రబాబు రాజకీయాన్ని మరోసారి బయట పెడుతోంది.
 
 
 నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే, ఈ విపత్తు సమయంలో నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడి ప్రభుత్వ ఆగ్రహానికి గురై సస్పెండ్ అయిన సుధాకర్ సస్పెన్షన్ ను రద్దు చేయాలంటూ పదేపదే చంద్రబాబు ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారు. అయితే ఈ విషయంలో ఏం జరిగిందనే విషయం చంద్రబాబుకు బాగా తెలుసు. అయినా రాజకీయ ఎత్తుగడ లో భాగంగా పదే పదే వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టే విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నట్టు గా కనిపిస్తోంది. వాస్తవానికి నర్సీపట్నం ఆసుపత్రి అసలు కోవిడ్ ఆసుపత్రి కాదు.అక్కడ కరోనా పేషెంట్లు కూడా లేరు. అయితే డాక్టర్ సుధాకర్ మండలంలో జరుగుతున్న మున్సిపల్ సమీక్ష సమావేశానికి వచ్చి ప్రభుత్వంపై ఈ విధంగా విమర్శలు చేయడం పై ప్రభుత్వం సీరియస్ అయింది.
 
 
 మాస్కులు ఇచ్చారని కాకపోతే ఒక్కటి మాత్రమే ఇస్తున్నారని ఆయన విమర్శలు చేశారు. అయితే ఆ తర్వాత  మీడియా ప్రశ్నించిన సందర్భంలో అసలు మా స్కూలే ఇవ్వలేదు అంటూ ఆయన ఆరోపించారు. వాస్తవానికి ఈ ఆరోపణలు చేసిన సుధాకర్ ఎనస్థీషియా డాక్టర్. అసలు ఈయనకు కరోనాకు సంబంధమే లేదనేది వైసిపి ప్రభుత్వం చెబుతున్న వాదన. అసలు రాష్ట్రంలో ఎక్కడా అ మాస్కులు కొరత, వైద్య పరికరాల కొరత లేదనది ప్రభుత్వం చెబుతున్నా, సుధాకర్ కావాలని ఈ విపత్తు సమయంలో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా విమర్శలు చేశారని ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. అయితే ఇప్పుడు అన్ని విషయాలను పక్కన పెట్టి ప్రభుత్వంపై బురద జల్లే విధంగా ఆ వైద్యుడు వ్యవహారం చంద్రబాబునాయుడు సీరియస్ గా తీసుకోవడం విమర్శలకు తావిస్తోంది. కరోనా ను అడ్డుకునే విధంగా ప్రభుత్వానికి, ప్రజలకు, సలహాలు ఇవ్వాల్సింది పోయి ఈ సమయంలో ప్రభుత్వంపై యధావిధిగా విమర్శలు చేస్తూ చంద్రబాబు ముందుకు వెళుతున్న తీరు ప్రజల్లో చర్చనీయాంశం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: