తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా  వైరస్ ప్రభావం పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ ను జయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. ప్రజలందరినీ ఒక్కతాటిపై నడిపిస్తూ కరోనా  వైరస్ పై  పోరాటం చేసేలా సూచనలు సలహాలు చేస్తుంది  రాష్ట్ర ప్రభుత్వం. ఈ పోరాటంలో భాగంగా ముఖ్యంగా డాక్టర్లు పోలీసులు పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలకు పణంగా పెట్టి ప్రజలకు సేవ చేస్తున్న విషయం తెలిసిందే. పారిశుద్ధ్య కార్మికులు ఆసుపత్రిలో రోగులకు చికిత్స అందిస్తున్నారు. 

 

 

 కరోనా వైరస్ వ్యాప్తి తో ప్రాణాలు పోతాయని తెలిసినప్పటికీ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా  వైరస్ బారిన పడిన వారికి చికిత్స అందిస్తున్నారు... మరోవైపు పోలీసులు ప్రభుత్వ సూచనలు ప్రజల పాటించి ప్రాణాలను రక్షించుకునే విధంగా రోడ్లపై నిలబడుతూ ప్రజలందరినీ కంట్రోల్ చేస్తూ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే పారిశుద్ధ కార్మికులు కూడా కరోనా  వైరస్ పై తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తున్నారు. ఎందుకంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా కరోనా వైరస్ ప్రజల దరి చేరకుండా ఉండేందుకు వీలు ఉంటుంది అనే విషయం తెలిసిందే. 

 

 

 అయితే ఇలా పారిశుధ్య కార్మికులు కరోనా  వైరస్ మహమ్మారిపై పోరులో భాగంగా అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు కృషిని గుర్తించిన తెలంగాణ సర్కార్ వారికి ఒక కానుక ప్రకటించింది. కరోనా  వైరస్ పై  అలుపెరుగని పోరాటం చేస్తూ ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఓ ప్రత్యేక కానుక  ప్రకటించినది  తెలంగాణ ప్రభుత్వం. కరోనా  వైరస్ నియంత్రణ విధుల్లో పాల్గొంటున్న ప్రతి పారిశుద్ధ్య కార్మికుడి ఖాతాలో ఐదువేల రూపాయలు జమ కానున్నాయి. దీనికోసం ప్రభుత్వం 21.84 కోట్లు విడుదల చేసింది. కాగా సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో పారిశుద్ధ్య కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr